Realme Narzo 90x 5G launching with sony camera and 144hz display
Realme Narzo 90x 5G: రియల్ మీ అప్ కమింగ్ బడ్జెట్ సిరీస్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ రివీల్ చేసింది. ఈ ఫోన్ కీలక ఫీచర్స్ లో ఈ ఫోన్ కలిగిన డిజైన్, కెమెరా మరియు మరిన్ని వివరాలు ఉన్నాయి. ఈ అప్ కమింగ్ రియల్ మీ ఫోన్ బడ్జెట్ సిరీస్ నుంచి వచ్చే ఫోన్ కాబట్టి ఈ ఫోన్ ఫీచర్స్ పై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తారు. అయితే, కంపెనీ రివీల్ చేసిన ఫీచర్స్ చూస్తుంటే, ఈ ఫోన్ బడ్జెట్ ధరలో గొప్ప ఫీచర్స్ తో వచ్చే ఫోన్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
రియల్ మీ నార్జో 90 ఎక్స్ స్మార్ట్ ఫోన్ వెనుక గ్రేడియంట్ చారలు కలిగిన సరికొత్త డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ తో ఫోన్ చూడటానికి కొత్తగా మరియు ఆకర్షణీయంగా ఉండేలా చేసింది. ఈ ఫోన్ లో 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన గొప్ప డిస్ప్లేతో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ ఉన్నట్లు కూడా టీజర్ ఇమేజ్ ద్వారా వెల్లడించింది.
ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ ను చూస్తే, ఇందులో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP Sony మెయిన్ కెమెరా జతగా మరో కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ కూడా AI ఎడిట్ జీనీ మరియు AI ఎడిటర్ వంటి కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 400% భారీ సౌండ్ అందించే స్పీకర్ సెటప్ కూడా ఉంటుంది.
ఇక ఈ ఫోన్ లో ప్రదమైన ఆకర్షణగా నిలిచే బ్యాటరీ కేటగిరికి వస్తే, ఈ ఫోన్ ను 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ మాత్రమే కాదు వేగవంతమైన 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది.
Also Read: BSNL: కేవలం రూ. 399 రూపాయలకే 3300 GB హై స్పీడ్ డేటా అందుకోండి.!
రియల్ మీ నార్జో 90 ఎక్స్ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు రియల్ మీ నార్జో 90 5జి స్మార్ట్ ఫోన్ కొద లాంచ్ అవుతుంది. ఈ రెండు ఫోన్స్ కూడా లాంచ్ అయిన తర్వాత అమెజాన్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి.