Realme Narzo 90 and Narzo 90X launching tomorrow in india
Realme Narzo 90 మరియు NARZO 90x రేపు ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. నార్జో 90 సిరీస్ నుంచి ఈ రెండు ఫోన్లు కూడా రియల్ మీ లాంచ్ చేస్తోంది. ఈ రెండు కొత్త ఈ ఫోన్స్ డిజైన్ మరియు చాలా కీలక ఫీచర్స్ కూడా కంపెనీ అందించింది. రేపు విడుదల కాబోతున్న ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కీలక ఫీచర్లు లాంచ్ కంటే ఒకరోజు ముందే తెలుసుకోండి.
ఈ రెండు స్మార్ట్ ఫోన్లు రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతాయి. ఈ రెండు ఫోన్లు కూడా అమెజాన్ స్పెషల్ ఫోన్స్ గా ఇండియాలో లాంచ్ అవుతున్నాయి.
ఈ ఫోన్ విక్టరీ పవర్ డిజైన్ తో ఉంటుంది కేవలం 7.79mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన బిగ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రెండు 50MP కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి ముందు మరియు మరొకటి సెల్ఫీ కెమెరా. ఈ ఫోన్ Ai ఎడిట్ జీనీ మరియు ఎఐ ఎడిటర్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ రియల్ మీ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది.
Also Read: మీ Smartphone లో వైరస్ వచ్చిందని డౌట్ ఉంటే, ఇలా సులభంగా చెక్ చేయండి.!
Realme Narzo 90x : కీలక ఫీచర్స్
ఈ ఫోన్ కూడా రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఏరో ఫ్లో డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ మరియు బోల్డ్ వైబ్ తో ఉంటుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన బిగ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 400% బిగ్ సౌండ్ అందించే అల్ట్రా వాల్యూమ్ స్పీకర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP సోనీ Ai డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా ఎఐ ఎడిట్ జీనీ + ఎఐ ఎడిటర్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఈ ఫోన్ 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.