Realme NARZO 100 Lite 5G launched in India know the price and features
Realme NARZO 100 Lite 5G: రియల్ మీ తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన నార్జో సిరీస్ నుంచి ఈరోజు కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. అదే, రియల్ మీ నార్జో 100 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఇది బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో కూడా 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది.
రియల్ మీ నార్జో 100 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ అందించాము.
రియల్ మీ నార్జో 100 లైట్ (4GB + 64GB) ప్రైస్ : రూ. 13,499
రియల్ మీ నార్జో 100 లైట్ (4GB + 128GB) ప్రైస్ : రూ. 14,499
రియల్ మీ నార్జో 100 లైట్ (6GB + 128GB) ప్రైస్ : రూ. 16,499
ఈ లేటెస్ట్ రియల్ మీ ఫోన్ ఫ్రాస్ట్ సిల్వర్ మరియు థండర్ బ్లాక్ రెండు రంగుల్లో లభిస్తుంది.
ఈ రియల్ మీ కొత్త ఫోన్ ఫస్ట్ సేల్ ఏప్రిల్ 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ పై సింగల్ డే బిగ్ డీల్స్ కూడా రియల్ మీ అనౌన్స్ చేసింది. అవేమిటంటే, ఈ ఫోన్ 4GB ర్యామ్ వేరియంట్స్ పై రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు 6GB ర్యామ్ వేరియంట్ పై రూ. 1,500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
Also Read: Motorola Edge 70 Pro: నెట్టింట్లో వైరల్ అవుతున్న అప్ కమింగ్ ఫోన్ లీక్స్ అండ్ రూమర్స్.!
రియల్ మీ నార్జో 100 లైట్ స్మార్ట్ ఫోన్ 6.8 ఇంచ్ LCD స్క్రీన్ తో వచ్చింది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, HD+ రిజల్యూషన్ మరియు 900 నిట్స్ (HBM) బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ బడ్జెట్ 5జి చిప్ సెట్ Dimensity 6300 తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6 జీబీ ఫిజికల్ ర్యామ్, 8 జీబీ డైనమిక్ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ రియల్ మీ UI 7.0 సాఫ్ట్ వేర్ మరియు ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యింది.
ఈ ఫోన్ 13MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI ఎరేజర్ 2.0, Ai క్లియర్ ఫేస్ Ai స్మార్ట్ ఇమేజ్ మెట్టింగ్ వంటి అనేక ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 7000 mAh బిగ్ బ్యాటరీని రియల్ మీ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, బైపాస్ ఛార్జ్ సపోర్ట్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా అందించింది.
డిజైన్ పరంగా ఆర్మర్ సెల్ ప్రొటెక్షన్ మరియు యాంటీ థెఫ్ట్ అలారం తో అందించింది. ఇందులో 300% అల్ట్రా బూమ్ స్పీకర్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ IP 64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఇలా దాదాపు ప్రీమియం ఫోన్ ఫీచర్స్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది.