రియల్ మి సంస్థ తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Realme GT Neo2 లాంచ్ డేట్ ప్రకటించింది. Realme GT Neo2 స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ 13 న ఇండియాలో లాంచ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది. ఈ ఫోన్ ను వర్చువల్ ఈవెంట్ ద్వారా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అయితే, ఇప్పటికే Flipkart ఈ ఫోన్ కోసం కేటాయించిన మైక్రో సైట్ ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లను వెల్లడించింది.
Realme GT Neo2 స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 870 చిప్ సెట్ తో పాటు 12GB RAM మరియు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో ప్యాక్ చేయబడుతుంది. రియల్ మి జిటి నియో 2 పెద్ద 5,000mAh బ్యాటరీని మరియు 65W సూపర్ డార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే గురించి కూడా కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన శాంసంగ్ E4 AMOLED డిస్ప్లే కలిగివుంటుంది.
ఈ ఫోన్ లో 64MP ట్రిపుల్ కెమెరా సిస్టం అందించబడింది. ఇక ఇందులో అందించిన ఛార్జింగ్ టెక్నలాజితో ఈ ఫోన్ కేవలం 36 నిముషాల్లో 0 నుండి 100% ఛార్జింగ్ చెయవచ్చని రియల్ మి చెబుతోంది. ఈ ఫోన్ ను గట్టిగా మరియు చల్లగా ఉంచడానికి స్టెయిన్ లెస్ స్టీల్ వేపర్ ప్లస్ ఛాంబర్ మరియు మల్టి లేయర్ కూలింగ్ సిస్టం అందించినట్లు కూడా టీజింగ్ ద్వారా వెల్లడించింది.