Realme 9: 108ఎంపి కెమెరా వంటి భారీ ఫీచర్లతో రేపు విడుదలవుతోంది..!!
Realme 9 స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 7న లాంచ్ అవుతోంది
90Hz సూపర్ AMOLED డిస్ప్లే
108ఎంపి Samsung ISOCELL HM6 సెన్సార్
రియల్ మీ ఇండియాలో ఏప్రిల్ 7న మరొక స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది. అదే, Realme 9 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను 108ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా వంటి భారీ ఫీచర్లతో భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్దమవుతొంది. ఈ స్మార్ట్ ఫోన్ 90Hz సూపర్ AMOLED డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ లాంచ్ వివరాలు మరియు ఫోన్ అంచనా మరియు రివీల్డ్ స్పెక్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్ వేద్దాం.
Surveyరియల్ మీ ఇండియన్ మార్కెట్లో రేపు విడుదల చేయనున్న ఈ Realme 9 స్మార్ట్ ఫోన్ ను 'Capture The Spark' అనే క్యాప్షన్ తో ప్రకటించింది. ఈ క్యాప్షన్ కెమెరా గురించి సూచిస్తోంది మరియు ఎక్కువ వెలుగును స్వీకరించే కెమెరా ఈ ఫోన్ లో ఇవ్వబడింది. రియల్ మీ 9 స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి Samsung ISOCELL HM6 సెన్సార్ అందించింది. ఈ సెన్సార్ 9-Sum పిక్సెల్ బిన్నింగ్ టెక్ తో పనిచేస్తుంది మరియు మంచి ఫోటో లను తెయ్యగలదు. దీనికి జతగా 4CM మ్యాక్రో సెన్సార్ మరియు 120 డిగ్రీల సూపర్ -వైడ్ సెన్సార్ కూడా ఉన్నాయి. అంటే, మొత్తంగా వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ఫ్లాష్ లైట్ కూడా వుంది.
ఇక ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ కేవలం 7.99mm మందంతో చాలా స్లిమ్ గా వుంది. ఈ ఫోన్ లో 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన SuperAMOLED వుంది. ఈ డిస్ప్లే లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ హార్ట్ రేట్ మోనిటర్ ని కూడా అందించింది. ఈ డిస్ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కూడా అందించగలదని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ సన్ బరస్ట్ గోల్డ్, స్టార్ గేజ్ వైట్ మరియు మేటర్ బ్లాట్ అనే మూడు కలర్ లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.