Realme C55: రేపు ఇండియాలో లాంచ్ అవుతున్న ఈ ఫోన్ ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.!

Realme C55: రేపు ఇండియాలో లాంచ్ అవుతున్న ఈ ఫోన్ ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.!
HIGHLIGHTS

రియల్ మి తన కొత్త ఫోన్ ను ఇండియాలో విడుదల చేయడానికి సిద్దమవుతోంది

ఈ స్మార్ట్ ఫోన్ ను రేపు ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది

ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి

రియల్ మి తన కొత్త ఫోన్ ను ఇండియాలో విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఇటీవల ఇండోనేషియాలో విడుదల చేసిన Realme C55 స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు ఇండియాలో లాంచ్ చెయ్యడానికి రెడీ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను రేపు మధ్యాహ్నం 12:30 గంటలకి ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

 రియల్ మి ఈ ఫోన్ ను ముందుగా ఇండోనేషియాలో లాంచ్ చేసింది. ఇండియా వేరియంట్ కూడా అదే విధంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్లను గురించి కంపెనీ టీజింగ్ ద్వారా వెల్లడించింది. ఈ ఫీచర్ల ద్వారా ఈ ఫోన్ అదే అవుతుందని చెబుతున్నారు. ఇక ఇండోనేషియా వేరియంట్ ధర మరియు ఫీచర్లు క్రింద చూడవచ్చు.

Realme C55: స్పెక్స్ (ఇండోనేషియా) 

రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ Layar FHD+ స్క్రీన్ ని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ లో పైన ఉన్న సెల్ఫీలే కెమేరా చుట్టూ ఒక నోటిఫికేషన్ భార్ తో కొత్త ఫీచర్ కనిపిస్తుంది. ఈ బార్ ఫీచర్ ను 'Mini Capsule' గా పిలుస్తోంది. ఈ ఫీచర్ వలన ఫోన్ ప్రీమియం ఫోన్ ఫీల్ మరియు లుక్ ను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Helio G88 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ లను అప్షన్ లను కలిగి ఉంటుంది. 

కెమెరాల పరంగా, రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమేరా వుంది. ఇందులో, కేవలం 64MP ప్రైమరీ మరియు 2MP సెకండరీ కెమేరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Android 13 OS ఆధారితమైన Realme UI 4.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.

Realme C55: ఇండోనేషియా ధర 

Realme C55 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (6GB+128GB) వేరియంట్ ధర Rp 2,499,000 (సుమారు రూ.13,300) తో లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ ప్రస్తుతం ఇండోనేషియాలో లభిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo