Realme 9 Pro + : ఆండ్రాయిడ్ 12 మరియు 50MP సోనీ కెమెరా వంటి భారీ ఫీచర్లతో వచ్చింది

HIGHLIGHTS

రియల్‌మీ ఈరోజు Realme 9 Pro మరియు 9 Pro + లను విడుదల చేసింది

5GB ఎడిషన్ వర్చువల్ RAM సపోర్ట్ తో తీసుకువచ్చింది

Realme UI 3 స్కిన్ పైన లేటెస్ట్ Android 12 OS పైన నడుస్తుంది

Realme 9 Pro + : ఆండ్రాయిడ్ 12 మరియు 50MP సోనీ కెమెరా వంటి భారీ ఫీచర్లతో వచ్చింది

రియల్‌మీ ఈరోజు 9 Pro సిరీస్ నుండి Realme 9 Pro మరియు 9 Pro + స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. వీటిలో Realme 9 Pro + భారీ ఫీచర్లతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను Dimensity 920 5G ప్రోసెసర్ మరియు OIS మరియు EIS సపోర్ట్ కలిగిన Sony IMX766 (50MP) కెమెరా సిస్టంతో రియల్‌మీ తీసుకొచ్చింది. అంతేకాదు,  5GB ఎడిషన్ వర్చువల్ RAM సపోర్ట్ తో తీసుకువచ్చింది. ఈ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం.        

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 9 Pro + : స్పెక్స్

రియల్‌మీ 9 ప్రో + స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లేని కలిగివుంది మరియు ఇది 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా అందించింది. ఇది కేవలం 7.9mm మందంతో చాలా స్లిమ్ డిజైన్ తో వచ్చింది.  ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 920 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 8GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది 5GB ఎడిషన్ వర్చువల్ RAM కి మద్దతు ఇస్తుంది.

అంటే, ఈ Realme ఫోన్ 13GB RAM పనితీరును ఇవ్వగలదు మరియు 256GB ఇంటర్నల్ స్టోర్ కూడా అందుతుంది. ఈ లేటెస్ట్ రియల్ మి ఫోన్  Realme UI 3 స్కిన్ పైన లేటెస్ట్ Android 12 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరచడానికి వీలుగా వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా జతచేసింది. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్, అరోరా గ్రీన్, సన్ రైజ్ బ్లూ అనే మూడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.      

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని అందించింది. ఇందులో 50MP మైన్ కెమెరాగా OIS మరియు EIS సపోర్ట్ కలిగిన SonyIMX766 సెన్సార్ నిఅందించింది. జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ ఫోన్ కెమెరా కోసం స్ట్రీట్ ఫోటోగ్రఫీ 2.0 సపోర్ట్ ను కూడా జతచేసింది.   ఈ ఫోన్ టైప్-C పోర్ట్ తో 60W  సూపర్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500 mAh బ్యాటరీని కలిగివుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ మరియు Hi-Res సర్టిఫికేషన్ కలిగి ఉంది మరియు డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది.           

Realme 9 Pro +: ధర

Realme 9 Pro + స్మార్ట్ ఫోన్ యొక్క 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ధర రూ. 24,999, 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999 మరియు 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999 గా నిర్ణయించింది. అయితే, Flipakrt స్మార్ట్ అప్ గ్రేడ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్ అఫర్ తో ప్రకటించింది. ఈ అఫర్ ద్వారా 6GB+128GB వేరియంట్ రూ.17,499 రూపాయలకు, 8GB+128GB వేరియంట్ రూ.18,899 కు, 8GB+256GB వేరియంట్ రూ.20,299 రూపాయలకు పొందవచ్చని Realme లాంచ్ ఈవెంట్ నుండి తెలిపింది. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఫిబ్రవరి 21 న మధ్యాహ్నం 12 గంటలకు Flipkart మరియు Realme అధికారిక వెబ్సైట్ నుండి జరగనుంది.           

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo