Realme GT Series: ప్రీమియం ఫీచర్లతో వచ్చిన రియల్‌మీ లేటెస్ట్ ఫోన్స్

HIGHLIGHTS

Realme GT మరియు Realme GT మాస్టర్ ఎడిషన్ లాంచ్

ఈ లేటెస్ట్ రియల్‌మీ స్మార్ట్ ఫోన్స్ శక్తివంతమైన ప్రోసెసర్ లతో వచ్చాయి

మిడ్ రేంజ్ లో ప్రిమియం ఫీచర్లతో వచ్చిన GT సిరీస్

Realme GT Series: ప్రీమియం ఫీచర్లతో వచ్చిన రియల్‌మీ లేటెస్ట్ ఫోన్స్

Realme ఈరోజు తన లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లయినా Realme GT మరియు Realme GT మాస్టర్ ఎడిషన్ లను విడుదల చేసింది. ఈ లేటెస్ట్ రియల్‌మీ స్మార్ట్ ఫోన్స్ శక్తివంతమైన ప్రోసెసర్ లతో వచ్చాయి. వీటిలో, రియల్‌మీ జిటి ఫోన్ క్వాల్కమ్ ప్రీమియం మరియు వేగవంతమైన ప్రొసెసర్ స్నాప్ డ్రాగన్ 888 SoC  కలిగి ఉండగా, రియల్‌మీ జిటి మాస్టర్ ఎడిషన్ మాత్రం స్నాప్ డ్రాగన్ 778 ప్రోసెసర్ ని కలిగివుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ప్రైస్, స్పెక్స్ మరియు ఫీచర్లను గురించి చర్చిద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రియల్‌మీ జిటి సిరీస్: ప్రైస్

రియల్‌మీ జిటి స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ.37,999 రూపాయల ప్రారంభ ధరతో ప్రకటించగా, రియల్‌మీ జిటి మాస్టర్ ఎడిషన్ బేసిక్ వేరియంట్ రూ.25,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ నుండి ప్రారంభమవుతుంది. రియల్‌మీ జిటి మొదటి సేల్ ఆగష్టు 25 నుండి మొదలవుతుండగా, రియల్‌మీ జిటి మాస్టర్ ఎడిషన్ మాత్రం ఆగష్టు 26 నుండి అమ్మకానికి వస్తుంది.

రియల్‌మీ జిటి: స్పెక్స్

రియల్‌మీ జిటి స్మార్ట్ ఫోన్ 6.43 ఇంచ్ FHD+ సూపర్ AMOLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 5G SoC ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 12GB LPDDR5 ర్యామ్ కూడా ఉంది. ఈ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500 బ్యాటరీటూ వచ్చింది. ఈ ఫోన్ లో 64MP SonyIMX682 సెన్సార్ ని ప్రధాన కెమెరాగా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. సెల్ఫీల కోసం 16MP వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ Realme UI 2.0 స్కిన్ పైన                                          Android 11 OS పైన నడుస్తుంది.

రియల్‌మీ జిటి మాస్టర్ ఎడిషన్: స్పెక్స్

ఇక రియల్‌మీ జిటి మాస్టర్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.43-అంగుళాల FHD+ సూపర్ AMOLED ఫుల్‌స్క్రీన్‌ ను 120 Hz  రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G  5G ప్రాసెసర్ తో వచ్చిన రెండవ ఫోనుగా నిలుస్తుంది మరియు 65W సూపర్‌డార్ట్ ఛార్జ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3D మోల్డింగ్ వేగన్ లెదర్ డిజన్ తో 8.7 మిమీ మందం మరియు కేవలం 180 గ్రా బరువుతో చాల లైట్ గా ఉంటుంది.

ఇక కెమెరాల పరంగా, ఈ ఫోన్ 64-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, సెకండరీ 8-మెగాపిక్సెల్ లెన్స్ మరియు మూడవ 2-మెగాపిక్సెల్ లెన్స్‌తో ట్రిపుల్ లెన్స్ సెటప్‌ తో వచ్చింది. ఈ ఫోన్ 4300mAh డ్యూయల్ సెల్ బ్యాటరీని  65W ఫాస్ట్ సూపర్‌డార్ట్ ఛార్జర్‌ సపోర్ట్ తో కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo