Realme GT Neo 3: ఇండియాలో విడుదలకు సిద్ధమైన 150W ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్..!!

HIGHLIGHTS

Realme GT Neo 3 ఇండియాలో విడుదలవుతోంది

150W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది

భారీ స్పెక్స్ తో వస్తుంది

Realme GT Neo 3: ఇండియాలో విడుదలకు సిద్ధమైన 150W ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్..!!

రియల్‌మీ ఇటీవల చైనాలో విడుదల చేసిన Realme GT Neo 3 యొక్క ఇండియా వేరియంట్ లాంచ్ డేట్ ప్రకటించింది. చైనాలో ఈ స్మార్ట్ ఫోన్ ను అత్యంత వేగవంతమైన 150W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ తో అందించింది మరియు ఇండియాలో కూడా అదే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో తీసుకువస్తునట్లు, రియల్ మీ CEO మాధవ్ సేత్ వెల్లడించారు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 80W ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్ కూడా ఉండవచ్చని ఊహిస్తున్నారు. త్వరలో రానున్న ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అంచనా స్పెక్స్ క్రింద చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వాస్తవానికి, చైనాలో విడుదలైన ఈ Realme GT Neo 3 వేరియంట్ నే ఇండియాలో కూడా విడుదల చెయ్యవచ్చని ఉహసిస్తున్నారు. Realme GT Neo 3 చైనా వేరియంట్ స్పెక్స్ వివరాలను క్రింద చూడవచ్చు.            

Realme GT Neo 3: స్పెక్స్ (చైనా వేరియంట్)

రియల్‌మీ జిటి నియో 3 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది మరియు ఈ డిస్ప్లే 1000 Hz టచ్ శాంప్లింగ్ తో వస్తుంది. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8100 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా Realme UI 3.0 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది.

Realme GT Neo 3-5.jpg

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP SonyIMX766  మైన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ అత్యంత వేగవంతమైన 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500 బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ కేవలం 5 నిముషాల్లోనే 50% ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.           

Realme GT Neo 3: ధర (చైనా వేరియంట్)

చైనాలో ఈ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ (8GB/256GB) ధర CNY 2,599 (సుమారు రూ. 31,100) మరియు రెండవ వేరియంట్ (12GB/256GB) ధర CNY 2,799 (సుమారు రూ. 33,500).

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile