Realme GT 7T: స్టన్నింగ్ ఫీచర్స్ మరియు డిజైన్ తో లాంచ్ అయ్యింది.!
రియల్ మ్మి ఈరోజు GT 7 సిరీస్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది
realme GT 7T ఫోన్ ను స్టన్నింగ్ ఫీచర్స్ మరియు మిడ్ రేంజ్ ప్రైస్ లో లాంచ్ చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేకమైన రేసింగ్ ఎల్లో వేరియంట్ ను కూడా అందించింది
realme GT 7T: రియల్ మ్మి ఈరోజు GT 7 సిరీస్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఇందులో రియల్ మీ GT 7T స్మార్ట్ ఫోన్ కూడా వుంది. ఈ ఫోన్ ను స్టన్నింగ్ ఫీచర్స్ మరియు మిడ్ రేంజ్ ప్రైస్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేకమైన రేసింగ్ ఎల్లో వేరియంట్ ను కూడా అందించింది. ఈ రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
SurveyRealme GT 7T: ఫీచర్స్
రియల్ మీ ఈ ఫోన్ గొప్ప డిజైన్ మరియు సరికొత్త కలర్స్ లో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను గ్రాఫీన్ తో కూడిన సరికొత్త 360° కూలింగ్ ఐస్ సెన్స్ డిజైన్ తో అందించింది. జిటి 7టి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ ఇటీవల అందించిన లేటెస్ట్ 5జి ఆక్టా కోర్ చిప్ సెట్ Dimensity 8400 MAX తో పని చేస్తుంది. ఇది బ్లేజింగ్ పెర్ఫార్మన్స్ మరియు ఎనర్జీ ఆదా చేసే చిప్ సెట్ మరియు 1.78M AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా 12GB ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో గొప్ప డిస్ప్లే సపోర్ట్ కూడా అందించింది. జిటి 7టి స్మార్ట్ ఫోన్ లో 6.79 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది మరియు ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR 10+, Dolby Vision సపోర్ట్ కలిగి ఉండటమే కాకుండా 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 7000 mAh హెవీ బ్యాటరీ ఉంటుంది మరియు దీనికి తగిన 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది.
ఇక రియల్ మీ జిటి 7టి స్మార్ట్ ఫోన్ కెమెరా డిటైల్స్ చూస్తే, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP Sony IMX 896 OIS మెయిన్ కెమెరా మరియు జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. ఇందులో 32MP (Sony IMX615) సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 30/60 FPS తో స్టేబుల్ 4K వీడియోలను ఆఫర్ చేస్తుందని రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ Ai సపోర్ట్ తో Ai కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Alcatel V3 Ultra ఫోన్ ను బడ్జెట్ ధరలో స్టయిల్స్ పెన్ తో లాంచ్ చేసిన ఆల్కాటెల్.!
Realme GT 7T: ప్రైస్
రియల్ మీ జిటి 7టి మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ 8GB + 256GB వేరియంట్ ను రూ. 34,999 ధరతో లాంచ్ చేసింది. అలాగే, 12GB + 256GB వేరియంట్ ను రూ. 37,999 ధరతో మరియు 12GB + 512GB వేరియంట్ ను రూ. 41,999 ధరతో లాంచ్ చేసింది. మే 30వ తేదీన ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ రియల్ మీ అఫీషియల్ వెబ్సైట్ మరియు అమెజాన్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఆఫర్స్
రియల్ మీ ఈ ఫోన్ ఆకట్టుకునే ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ పై రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 3,000 అదనపు ఎక్స్ చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ను ప్రధాన బ్యాంక్ కార్డ్స్ తో తీసుకునే వారికి ఈ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత మొబైల్ తో ఎక్స్ చేంజ్ హన్స్ వారికి ఈ అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ లభిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile