Realme ఫ్యాన్ ఫెస్టివల్ 2022 నుండి రియల్ మీ నార్జో 50 పైన భారీ డీల్స్.!

HIGHLIGHTS

Realme Fan Festival 2022 సేల్ ను ప్రకటించిన రియల్ మీ

ఈ సేల్ నుండి రియల్ మీ ఫోన్ల పైన గొప్ప ఆఫర్లను మరియు డీల్స్ ను ఆఫర్ చేస్తోంది

ఈ ఫోన్ ను ప్రీపెయిడ్ అప్షన్ తో కొనేవారికి 1500 రూపాయల్ వరకు తగ్గింపు లభిస్తుంది

Realme ఫ్యాన్ ఫెస్టివల్ 2022 నుండి రియల్ మీ నార్జో 50 పైన భారీ డీల్స్.!

Realme Fan Festival 2022 సేల్ ను ప్రకటించిన రియల్ మీ. ఈరోజు నుండి మొదలైన ఈ సేల్ నుండి రియల్ మీ ఫోన్ల పైన గొప్ప ఆఫర్లను మరియు డీల్స్ ను ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి లేటెస్ట్ బడ్జెట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ నార్జో 50 పైన మంచి డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ హీలియో G96 ఆక్టా కోర్ గేమింగ్ ప్రొసెసర్, 120Hz హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు 33W డార్ట్ ఛార్జ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఉంటుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు realme.com నుండి ఈ అఫర్ లతో లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme Narzo 50: ధర

రియల్‌మీ నార్జో 50 స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో రూ.12,999 రూపాయల ప్రారంభ ధరతో వచ్చింది. రెండవ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ.15,499 ధరతో ప్రకటించబడింది. ఈ ఫోన్ ను ప్రీపెయిడ్ అప్షన్ తో కొనేవారికి 1500 రూపాయల్ వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే, అమెజాన్ నుండి బజాజ్ ఫైన్ సర్వ్ అప్షన్ తో కొనేవారికి No Cost EMI కూడా వర్తిస్తుంది.  Buy From Here    

Realme Narzo 50: స్పెక్స్

రియల్‌మీ నార్జో 50 స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే 90% స్క్రీన్ టూ బాడీ రేషియో మరియు 180 టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది.ఈ ఫోన్ మీడియాటెక్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 6GB ర్యామ్ కూడా ఉంది. అదనంగా, ఈ ఫోన్ లో అందించిన డైనమిక్ ర్యామ్ ఎక్స్ ఫ్యాన్షన్ ఫీచర్లతో 5GB వరకు వర్చువల్ జత అవుతుందని కూడా తెలిపింది. అంటే, 6GB + 5GB తో 11GB వరకూ పనితనాన్ని అందించగలదని వెల్లడించింది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP మైన్ సెన్సార్, 2MP మ్యాక్రో సెన్సార్ మరియు 2MP B&W  కెమెరాని కలిగి ఉంది. ఇక సెల్ఫీల కోసం 16MP ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ Realme UI 2.0 స్కిన్ పైన Android 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 33W డార్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 బిగ్ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మరియు స్పీడ్ బ్లూ మరియు స్పీడ్ బ్లాక్ అనే రెండు కలర్ లలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo