Realme C73 5G launched with 6000 mah big battery
Realme C73 5G: రియల్ మీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ C సిరీస్ నుంచి ఈరోజు 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో రియల్ మీ సి73 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా సన్నని డిజైన్ మరియు పెద్ద బ్యాటరీ తో అందించింది. ఈ ఫోన్ ను లాంచ్ చేయడమే కాకుండా ఈరోజు నుంచే సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది.
రియల్ మీ ఈ ఫోన్ ను రెండు వేరియంట్లలో అందించింది. ఈ ఫోన్ యొక్క బేసిక్ (4GB + 64GB) వేరియంట్ రూ. 10,499 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ (4GB + 128GB) వేరియంట్ రూ. 11,499 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ రియల్ మీ అధికారిక వెబ్సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా సేల్ కి అందుబాటులోకి వచ్చింది.
ఈ రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ తో లాంచ్ ఆఫర్స్ కూడా రియల్ మీ అందించింది. ఈ ఫోన్ పై రూ. 500 రూపాయల ఆల్ బ్యాంక్ Credit Card EMI డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంటే, ఈ ఫోన్ ను క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ. 9,999 ధరకే లభిస్తుంది.
Also Read: OnePlus 13s లాంచ్ కంటే ముందే అంచనా ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
రియల్ మీ సి 73 స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 బడ్జెట్ 5G చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ తో జతగా 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా అందించింది. ఈ ఫోన్ లో 12GB వరకు Dynamic RAM ఫీచర్ సపోర్ట్ ను కూడా అందించింది.
ఈ రియల్ మీ ఫోన్ కేవలం 7.94mm మందంతో ఉంటుంది. అయితే, ఈ ఫోన్ లో పెద్ద 6000 mAh బిగ్ బ్యాటరీ అందించింది. ఈ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 15W`ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా ఈ ఫోన్ ల్లో అందించింది. ఈ ఫోన్ 6.67 ఇంచ్ HD+ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 625 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
రియల్ మీ సి 73 ఫోన్ లో వెనుక 32MP (AF) ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 10x డిజిటల్ జూమ్, 1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.