తక్కువ ధరలో iPhone లాంటి ఫీచర్ తో ఫోన్ ను తెచ్చిన రియల్ మి.!
తక్కువ ధరలో iPhone లాంటి ఫీచర్ తో ఫోన్ ను తెచ్చిన రియల్ మి
కొత్త Realme C55 స్మార్ట్ ఫోన్ లో అందించింది
ఇది మీకు వినూత్నమైన పద్దతిలో నోటిఫికేషన్లను చూపిస్తుంది
తక్కువ ధరలో iPhone లాంటి ఫీచర్ తో ఫోన్ ను తెచ్చిన రియల్ మి. iPhone లాంటి ఫీచర్ అంటే ఏమిటీ అనుకుంటున్నారా? ప్రీమియం iPhone 14 pro లో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ వంటి అమరికను పోలివుండే ఒక ఫీచర్ ను కొత్త Realme C55 స్మార్ట్ ఫోన్ లో అందించింది. స్క్రీన్ పైన ఉన్న సెల్ఫీ కెమేరా చుట్టూ నోటిఫికేషన్ బార్ గా మారిపోతుంది. అంతేకాదు, ఇది మీకు వినూత్నమైన పద్దతిలో నోటిఫికేషన్లను చూపిస్తుంది. అయితే,'ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతానికి ఇండోనేషియాలో లాంచ్ చెయ్యబడింది.
SurveyRealme C55: ఇండోనేషియా ధర
Realme C55 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (6GB+128GB) వేరియంట్ ధర Rp 2.499.000 (సుమారు రూ.13,300) తో లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ ప్రస్తుతం ఇండోనేషియాలో లభిస్తోంది.
Realme C55: స్పెక్స్ (ఇండోనేషియా)
రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ Layar FHD+ స్క్రీన్ ని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ లో పైన ఉన్న సెల్ఫీలే కెమేరా చుట్టూ ఒక నోటిఫికేషన్ భార్ తో కొత్త ఫీచర్ కనిపిస్తుంది. ఈ బార్ ఫీచర్ ను 'Mini Capsule' గా పిలుస్తోంది. ఈ ఫీచర్ వలన ఫోన్ ప్రీమియం ఫోన్ ఫీల్ మరియు లుక్ ను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Helio G88 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ లను అప్షన్ లను కలిగి ఉంటుంది.
కెమెరాల పరంగా, రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమేరా వుంది. ఇందులో, కేవలం 64MP ప్రైమరీ మరియు 2MP సెకండరీ కెమేరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Android 13 OS ఆధారితమైన Realme UI 4.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile