రియల్మీ C2 vs షావోమి రెడ్మి 7A : రూ.5,999 ధరలో బెస్ట్ ఏది ?

రియల్మీ C2 vs షావోమి రెడ్మి 7A : రూ.5,999 ధరలో బెస్ట్ ఏది ?
HIGHLIGHTS

ఈ రెండు స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి ఏది సరైన ఎంపికగా ఉంటుందో చూద్దాం.

షావోమి నిన్న కేవలం రూ.5,999 ధరతో ఇండియాలో విడుదల చేసినటువంటి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి రెడ్మి 7A స్మార్ట్ ఫోన్  ఈ ధరలో వేగవంతమైన ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ మరియు మరికొన్ని ప్రత్యేకతలతో వస్తుంది. అయితే, ఇదే ధరలో ముందుగా విడుదలైనటువంటి స్మార్ట్ ఫోన్ Realme C2, ఇప్పటికే ఈ ధరలో గట్టి పోటీగా నిలచిన ఫోనుగా చెప్పొచ్చు. కాబట్టి, ఈ రెండు స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి ఏది సరైన ఎంపికగా ఉంటుందో చూద్దాం.

డిస్ప్లే :

రెడ్మి 7A  18:9 ఆస్పెక్ట్ రేషియాతో HD+ రిజల్యూషన్ అందించగల ఒక 5.45 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ప్లేతో వస్తుంది. అయితే, రియల్మీC2 మాత్రం 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో HD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.1 అంగుళాల డ్యూ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో వస్తుంది. రెడ్మి 7A కొంచం మందపాటి బెస్జల్లను కలిగి తక్కువ స్క్రీనుతో వస్తుంది. అయితే, రియల్మీC2 మాత్రం సన్నని బెజెల్లను కలిగి ఎక్కువ స్క్రీన్ స్థలంతో వస్తుంది.

ప్రాసెసర్ :

రెడ్మి 7A మరియు రియల్మీ C2 రెండు కూడా 2.0 GHz క్లాక్ స్పీడ్ అందిస్తాయి. రెడ్మి 7A  ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా కోర్ ప్రాసెసరుతో వస్తుంది. ఇక రియల్మీ C2 విషయానికి వస్తే, ఇది మీడియా టెక్ హీలియో P22 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. రెడ్మి 7A 2GB ర్యామ్ కి జతగా 16GB లేదా 32GB స్టోరేజి ఎంపికలతో వస్తుంది. ఇక రియల్మీ 2GB మరియు 3GB RAM లకి జతగా 16GB మరియు 32GB ఎంపికలతో వస్తుంది.

కెమేరా :

కెమెరాల విషయానికి వస్తే, రెడ్మి 7A కేవలం 12MP సింగిల్ కెమేరాని Sony IMX486 సెన్సారుతో కలిగి ఉంటుంది. దీనితో, 1080p వీడియోలను 30fps వద్ద తీసుకోవచ్చు. ఇక రియల్మీ C2 విషయానికి వస్తే, ఇందులో 13MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఏ కెమేరాతో స్లో మోషన్ వీడియోలను కూడా తీసుకోవచ్చు. అలాగే, పోర్ట్రైట్ , బొకే వంటి ఫోటోలను కూడా తీసుకోవచ్చు. ఇందులో కూడా 1080p వీడియోలను 30fps. ఇక రెండు ఫోనులు కూడా ముందుభాగంలో ఒక 5MP సెల్ఫీ కెమేరాని కలిగి ఉంటాయి.

బ్యాటరీ :

రెడ్మి 7A మరియు రెండు కూడా ఒక 4,000mAh బ్యాటరీతో వస్తాయి. అయితే, రెడ్మి 7A మాత్రం 10 వాట్స్ చార్జిగుకు సపోర్ట్ చేయగల సాంకేతికతతో వస్తుంది.

OS :

రెడ్మి 7A MIUI 10 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 9 ఫై OS పైన నడుస్తుంది. రియల్మీC2 COLOR OS 6.0 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 9 ఫై OS పైన నడుస్తుంది.

ధరలు :

రెడ్మి 7A ధరలు

రెడ్మి 7A  (2GB + 16GB ) – 5,799 

రెడ్మి 7A  (2GB + 32GB ) – 5,999

రియల్మీ C2 ధరలు

రియల్మీ C2  (2GB + 16GB ) – 5,999 

రియల్మీ C2  (3GB + 32GB ) – 6,799  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo