Realme C15: ఎంట్రీ లెవల్ గేమింగ్ ఫోనుగా ఇండియాలో అడుగుపెట్టింది

Realme C15: ఎంట్రీ లెవల్ గేమింగ్ ఫోనుగా ఇండియాలో అడుగుపెట్టింది
HIGHLIGHTS

Realme C15, Realme C12 స్మార్ట్ ‌ఫోన్ ‌లను ఎంట్రీ లెవల్ స్మార్ట్ ‌ఫోన్ ‌లుగా భారత స్మార్ట్ ‌ఫోన్ మార్కెట్లో విడుదల చేశారు.

కేవలం స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా , Realme Buds Classic ని కూడా కంపెనీ ప్రారంభించింది.

షియోమి రెడ్‌మి 9 ప్రైమ్ ‌తో ఈ Realme C15, Realme C12 స్మార్ట్ ‌ఫోన్ ‌లు భారత మొబైల్ మార్కెట్ లో గట్టి పోటీ గా మారవచ్చు.

Realme C15, Realme C12 స్మార్ట్ ‌ఫోన్ ‌లను ఎంట్రీ లెవల్ స్మార్ట్ ‌ఫోన్ ‌లుగా భారత స్మార్ట్ ‌ఫోన్ మార్కెట్లో విడుదల చేశారు. కేవలం స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా , Realme Buds Classic ని కూడా కంపెనీ ప్రారంభించింది. Realme C15 ఇటీవల ఇండోనేషియా మార్కెట్‌లో కూడా లాంచ్ అయింది.  షియోమి రెడ్‌మి 9 ప్రైమ్ ‌తో ఈ Realme C15, Realme C12 స్మార్ట్ ‌ఫోన్ ‌లు భారత మొబైల్ మార్కెట్ లో గట్టి పోటీ గా మారవచ్చు. 

Realme C15 Price In India

ఇక Realme C15 యొక్కధర గురించి మాట్లాడితే, ఇది 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్‌ గల స్టార్టింగ్ వేరియంట్ రూ. 9,999 రూపాయలకు లాంచ్ చేయబడింది. అలాగే,  4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్ కేవలం 10,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఈ Realme C15 మొబైల్ ఫోన్ యొక్క మొదటి సెల్ ఆగస్టు 27 న ఫ్లిప్ ‌కార్ట్ మరియు రియల్‌ మీ ఇండియా స్టోర్ ద్వారా జరగనుంది.

Realme C15: ప్రత్యేకతలు

Realme C15 గత నెలలో ఆవిష్కరించబడింది, కాబట్టి ఈ స్మార్ట్ ‌ఫోన్ యొక్క ఫీచర్లు మనకు ముందే తెలుసు. ఈ రియల్ మీ సి 15 స్మార్ట్‌ ఫోన్ ఒక 6.5-అంగుళాల 29: 9 LCD డిస్‌ప్లేను హెచ్‌డి + రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఇది 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్న వాటర్ ‌డ్రాప్ నాచ్ తో వస్తుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ తో రక్షించబడింది. వెనుకవైపు, ఈ స్మార్ట్ ‌ఫోన్ ‌లో 13 ఎంపి ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మోనోక్రోమ్ కెమెరా మరియు 2 ఎంపి డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ‌ఫోన్ ‌లో వెనుక భాగంలో వేలిముద్ర సెన్సార్ కూడా ఉంది.

రియల్‌ మీ సి 15, MediaTek Helio G35 SoC తో పాటు జతగా 3 జిబి లేదా 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ ‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ఆండ్రాయిడ్ 10 OS పైన నడుస్తుంది. 6000 ఎంఏహెచ్ మొత్తం ప్యాకేజీకి అద్భుతమైన శక్తినిస్తుంది మరియు ఇది మైక్రో యుఎస్‌బి తో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo