Realme C12 First Sale: తక్కువ ధరలో పెద్ద బ్యాటరీ గేమింగ్ ప్రాసెసర్ కలిగిన స్మార్ట్ ఫోన్

Realme C12 First Sale: తక్కువ ధరలో పెద్ద బ్యాటరీ గేమింగ్ ప్రాసెసర్ కలిగిన స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

ఇటీవల, Realme C12 మరియు Realme C15 రెండు స్మార్ట్ ఫోన్లు కూడా Realme ఇండియాలో విడుదల చేసింది.

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఈ రియల్ మీ C12 యొక్క మొదటి ఫ్లాష్ సేల్ జరగుతుంది.

Realme C12 కేవలం రూ.8,999 ధరలో బడ్జెట్ గేమింగ్ ప్రాసెసర్ మరియు అతిపెద్ద బ్యాటరీ మరియు మంచి కెమేరా ఫీచర్లతో బడ్జెట్ సెగ్మెంట్ వినియోగదారులను ఆకర్షించే విధంగా విధంగా మార్కెట్లో తీసుకురాబడింది.

ఇటీవల, Realme C12 మరియు Realme C15 రెండు స్మార్ట్ ఫోన్లు కూడా Realme ఇండియాలో విడుదల చేసింది. వీటిలో, Realme C12 మాత్రం కేవలం రూ.8,999  ధరలో బడ్జెట్ గేమింగ్ ప్రాసెసర్ మరియు అతిపెద్ద బ్యాటరీ మరియు మంచి కెమేరా ఫీచర్లతో బడ్జెట్ సెగ్మెంట్ వినియోగదారులను ఆకర్షించే విధంగా విధంగా మార్కెట్లో తీసుకురాబడింది. అలాగే, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఈ రియల్ మీ C12 యొక్క మొదటి ఫ్లాష్ సేల్ జరగుతుంది.     

Realme C12 Price

Realme C12 కేవలం 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌ తో మాత్రమే వస్తుంది మరియు ఇది కేవలం రూ .8,999  తక్కువ ధరతో ప్రకటించింది.  రియల్ మీ సి 12 మొబైల్ ఫోన్ యొక్క మొదటి సెల్ ఆగస్టు 24 న, అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి జరగుతుంది. ఈ సేల్  Flipkart మరియు realme ఇండియా స్టోర్ ద్వారా జరుగుతుంది.

Realme C12: ప్రత్యేకతలు

రియల్‌ మీ సి 12 మొబైల్ ఫోన్ ఒక 6.5-అంగుళాల HD + డిస్ప్లే తో లాంచ్ చేయబడింది. ఇందులో మీకు వాటర్ ‌డ్రాప్ నోచ్ డిజైన్ చూడవచ్చు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌ లో మీకు 20: 9 యాస్పెక్ట్ రేషియో లభిస్తోంది. సేఫ్టీ పరంగా, మీరు ఫోన్ ‌లో గొరిల్లా గ్లాస్ రక్షణతో తీసుకురాబడింది .

రియల్‌ మీ సి 12 మొబైల్ ఫోన్ ‌ఒక మీడియాటెక్ హెలియో జి 35 చిప్‌ సెట్ శక్తితో పనిచేస్తుంది. ఇది ఆక్టా-కోర్ సిపియు మరియు ఇది 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్‌ తో జతగా వస్తుంది. ఒక  మైక్రో SD కార్డ్ సహాయంతో కూడా స్టోరేజ్ కూడా పెంచవచ్చు. ఈ మొబైల్ ఫోన్ RealmeUI 1.0 ఆధారంగా ఆండ్రాయిడ్ 10 తో  నడుస్తుంది.

రియల్‌ మీ సి 12 స్మార్ట్ ‌ఫోన్ ‌లో, వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్ ‌లో 13 ఎంపి ప్రైమరీ కెమెరా అమర్చారు, దీనికి జతగా 2 ఎంపి మోనోక్రోమ్ కెమెరాతో పాటు 2 MP డెప్త్ సెన్సార్ ‌ను కూడా పొందవచ్చు. ముందుభాగంలో, ఈ ఫోన్ ‌లో 5 MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఇది ఫోన్ ‌లో ఉన్న నోచ్ లో కనిపిస్తుంది. అలాగే, ఈ ఫోన్ ‌లో ఎల్‌ఈడీ ఫ్లాష్‌ ను కూడా చూడవచ్చు.

ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే, ఈ C 12 స్మార్ట్‌ ఫోన్ వెనుక ప్యానెల్‌ లో వేలిముద్ర సెన్సార్ ‌ను అందించింది. అదనంగా, ఈ ఫోన్ ‌లో ఒక అతి పెద్ద 6000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీఆటో వస్తుంది. ఈ బ్యాటరీ 10W స్పీడ్ ఛార్జింగ్ సాంకేతికతో ఉంటుంది. ఈ ఫోన్ ‌ను బ్లూ మరియు పవర్ సిల్వర్ కలర్ వంటి రెండు వేర్వేరు రంగులలో కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo