మరికొద్ది సేపట్లో.. Realme అతిపెద్ద బ్యాటరీ ఫోన్ Narzo 20 సేల్

HIGHLIGHTS

Narzo 20 తక్కువ ధరలో వస్తుంది.

ఈరోజు మద్యహ్నం 12 గంటలకి నార్జో 20 సేల్

నార్జో 20 48 MP ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది.

మరికొద్ది సేపట్లో.. Realme అతిపెద్ద బ్యాటరీ ఫోన్ Narzo 20 సేల్

రియల్‌ మి నార్జో 20 మొబైల్ ఫోన్‌ను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ‌లో అమ్మకానికి తీసుకురాబోతోంది. మీరు ఈ మొబైల్ ఫోన్‌ను రియల్‌.కామ్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ ఫోన్ ప్రారంభ ధర కేవలం రూ .10,499 మాత్రమే. అయితే, ఇంత తక్కువ ధరలో ఈ Narzo 20 అతిపెద్ద 6000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ మరియు 48 MP ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఈ మొబైల్ ఫోన్ యొక్క సెల్ మరియు దాని ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఈ క్రింద చూడవచ్చు. అలాగే, ఈ ఫోన్ యొక్క మొదటి ఫ్లాష్ సేల్ లో కేవలం సెకన్ల వ్యవధిలోనే 1.30 లక్షల ఫోన్లు అమ్ముడయ్యాని కూడా కంపెనీ ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme Narzo 20 ధర

రియల్‌ మీ నార్జో 20 ధర 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్‌తో బేస్ వేరియంట్‌కు రూ .10,499 మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు రూ .11,499. ఈ స్మార్ ఫోన్ గ్లోరీ సిల్వర్ మరియు విక్టరీ బ్లూ అనే రెండు రంగులలో లభిస్తుంది.

Realme Narzo 20 ఫీచర్లు

రియల్ మీ నార్జో 20 లో ఒక 6.5-అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే ఉంది, ఇది నార్జో 20A మాదిరిగానే ఉంటుంది, వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్‌ తో పాటు. ఫోన్ 9.8 మిల్లీమీటర్ల మందం మరియు 200 గ్రాముల బరువు ఉంటుంది.

మీడియాటెక్ హెలియో జి 85 ప్రాసెసర్‌ తో నడిచే నార్జో 20 స్టోరేజ్ అప్షన్స్ కోసం  4 జిబి ర్యామ్ మరియు 64 జిబి / 128 జిబి స్టోరేజ్ ఆప్షన్స్‌తో జతచేయబడ్డాయి. ఈ ఫోన్ 256GB వరకు మైక్రో SD కార్డులకు మద్దతు ఇస్తుంది మరియు Realme UI లో నడుస్తుంది.

రియల్ మీ నార్జో 20 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48 ఎంపి కెమెరా, 11 ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ మరియు 2 ఎంపి మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు వైపు, 8MP సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్ లోపల ఉంది.

నార్జో 20 లో అతిపెద్ద 6000W ఎంఏహెచ్ బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో వస్తుంది.     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo