Realme Narzo Series నుంచి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!

Realme Narzo Series నుంచి కొత్త ఫోన్ లాంచ్ కోసం రియల్ మీ టీజింగ్ మొదలుపెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను రియల్ మీ నార్జో 80 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ తర్వాత తరం ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకమైన టీజర్ ని అందించి టీజింగ్ చేస్తోంది. రియల్ మీ లాంచ్ చేయబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ విశేషాలు ఏమిటో చూద్దామా.

Realme Narzo Series అప్ కమింగ్ ఫోన్

రియల్ మీ నార్జో సిరీస్ నుంచి లాంచ్ చేయనున్న ఫోన్ నార్జో 80 లైట్ 5జి నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా వస్తుందని కంపెనీ అనౌన్స్ చేసింది. అంటే, నార్జో 90 లైట్ 5జి ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు చెప్పకనే చెబుతోంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి అనేక లీక్స్ ఆన్లైన్ చక్కర్లు కొడుతున్నాయి.

ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన టీజర్ పేజి అందించింది. ఎందుకంటే, ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ ఫోన్ గా లాంచ్ చేస్తోంది. ఈ టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ టీజర్ డీటెయిల్స్ రివీల్ చేస్తుంది.

Also Read: BSNL Budget Plans: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందుకోండి.!

Realme Narzo 80 Lite 5G: రూమర్ ఫీచర్స్

రియల్ మీ నార్జో 90 లైట్ స్మార్ట్ ఫోన్ పై ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న రూమర్ల ప్రకారం, ఈ ఫోన్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో లాంచ్ అవుతుందని రూమర్లు ఉన్నాయి. ఇదే కాదు ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్ మరియు 4జీబీ వర్చువల్ ర్యామ్ తో పాటు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుందని కూడా రూమర్లు ఉన్నాయి.

ఈ ఫోన్ లో 50MP ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉందని రూమర్లు చెబుతన్నాయి. రియల్ మీ నార్జో 90 లైట్ స్మార్ట్ ఫోన్ 6000 mAh బ్యాటరీ లేదా అంత కంటే పెద్ద బ్యాటరీ సపోర్ట్ తో లాంచ్ కావచ్చని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :