Realme 7 Series: విడుదలకు ముందే టాప్ వివరాలు లీక్, కళ్ళు చెదిరే స్పెక్స్ వీటి సొంతం

Realme 7 Series: విడుదలకు ముందే టాప్ వివరాలు లీక్, కళ్ళు చెదిరే స్పెక్స్ వీటి సొంతం
HIGHLIGHTS

Realme 7, Realme 7 Pro స్మార్ట్ ఫోన్స్ సెప్టెంబర్ 3 న లాంచ్ కానున్నట్లు కంపెనీ నిన్న ధృవీకరించింది.

Realme 7 Pro యొక్క ముఖ్యమైన ఫీచర్స్ అన్ని కూడా మునుపటి కొన్ని రూమర్లు మరియు అంచనా వివరాలను దాదాపుగా ధృవీకరిస్తూ ఆన్ ‌లైన్ ‌లో లీక్ అయ్యాయి.

Realme 7 Pro అత్యంత వేగంగా ఛార్జ్ చెయ్యగల మిడ్-రేంజ్ ఫోన్‌ లలో మొదటిదిగా నిలుస్తుంది.

Realme 7, Realme 7 Pro స్మార్ట్ ఫోన్స్ సెప్టెంబర్ 3 న లాంచ్ కానున్నట్లు కంపెనీ నిన్న ధృవీకరించింది. అయితే, ఈ ప్రకటన వచ్చిన కొద్ది గంటలకే, Realme  7 Pro యొక్క ముఖ్యమైన ఫీచర్స్ అన్ని కూడా మునుపటి కొన్ని రూమర్లు మరియు అంచనా వివరాలను దాదాపుగా ధృవీకరిస్తూ ఆన్ ‌లైన్ ‌లో లీక్ అయ్యాయి.

ముకుల్ శర్మ చేసిన ట్వీట్ ప్రకారం, రియల్ మి 7 ప్రో సూపర్ అమోలెడ్ స్క్రీన్, 64 MP క్వాడ్-కెమెరా సెటప్, 65 W SuperDart Charging టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లను ఉపయోగిస్తుంది. సోషల్ మీడియా హ్యాండిల్స్ ‌లో రాబోయే లాంచ్ ‌ను టీజ్ చేస్తుడడంతో ఈ ఫీచర్ సెట్స్‌ లో కొన్ని ఇప్పటికే Realme  ధృవీకరించింది. రియల్ మి దాని ధరను రూ .20,000 లోపు ఉంచినట్లయితే, Realme 7 Pro అత్యంత వేగంగా ఛార్జ్ చెయ్యగల మిడ్-రేంజ్ ఫోన్‌ లలో మొదటిదిగా నిలుస్తుంది.

Realme సంస్థ, ఇప్పటికే ఈ రియల్‌ మి 7 ప్రో కోసం బ్లైండ్ ఆర్డర్ ‌లను స్వీకరించడం కూడా ప్రారంభించింది మరియు ఆసక్తిగల కొనుగోలుదారులు రియల్‌ మి 7 మరియు 7 ప్రో లను ప్రీ-బుక్ చేయడానికి 1,000 రూపాయల ముందస్తు మొత్తాన్ని చెల్లించాలి. ప్రపంచవ్యాప్తంగా, రియల్ మి తన Realme X7 series ‌ను సెప్టెంబర్ 1 న ప్రారంభించటానికి సన్నద్ధమవుతోంది.

రియల్మే ఎక్స్ 7 సిరీస్ సెప్టెంబర్ 1 న ప్రారంభించనుంది

Realme X7 Series లీక్డ్ స్పెక్స్

రియల్‌ మీ X 7 ప్రో, FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ మరియు 120 హెర్ట్జ్ హై రిఫ్రెష్ రేట్‌తో ఒక 6.55-అంగుళాల AMOLED స్క్రీన్ ‌ను కలిగి ఉందని రూమర్ ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ఈ డిస్ప్లే లో సింగిల్ పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది మరియు ఇది 20: 9 యాస్పెక్ట్ రేషియోని ఇస్తుంది. ఈ స్క్రీన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్  కూడా కలిగివుంటుంది.

X7 ప్రో 2.6GHz మరియు మాలి-జి 77 GPU వద్ద క్లాక్ చేయబడిన లేటెస్ట్ ఆక్టా-కోర్ CPU అయిన  MediaTek Dimensity 1000+ చిప్ ‌సెట్ తో  తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఇది 6GB / 8GB RAM మరియు 128GB / 256GB స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారంగా Realme UI  ‌లో ఫోన్ నడుస్తుంది.

రియల్‌ మీ X 7 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ తో వస్తుంది, దీనిలో f/ 1.8 ఎపర్చరు గల ప్రాధమిక 64 MP  కెమెరాతో , 8 MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ, 2 MP మాక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ . వెనుక కెమెరాలు వీడియోలను, 30FPS వద్ద 4K రిజల్యూషన్ తో మరియు 1080p రిజల్యూషన్ తో 60FPS వరకు రికార్డ్ చేయగలవు. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఉంది.

రియల్ ‌మీ ఎక్స్‌ 7 ప్రో లో 4,500 mAh  బ్యాటరీ అమర్చబడి 65W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్‌కు మద్దతు ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo