Realme 16 Pro Series 5G India launch announced
Realme 16 Pro Series 5G : జస్ట్ రెండు రోజుల క్రితం నార్జో 90 సిరీస్ లాంచ్ అనౌన్స్ చేసిన రియల్ మీ, ఈరోజు అప్ కమింగ్ ప్రీమియం సిరీస్ అనౌన్స్ చేసింది. అదే, రియల్ మీ 16 ప్రో సిరీస్ మరియు ఈ సిరీస్ ను కెమెరా ప్రత్యేకమైన కొత్త సిరీస్ గా తీసుకొస్తున్నట్లు గొప్పగా చెబుతోంది. ఈ సిరీస్ లాంచ్ గురించి ఈరోజు రియల్ మీ అఫీషియల్ X అకౌంట్ మరియు వెబ్‌సైట్ నుంచి కూడా అనౌన్స్ చేసింది.
రియల్ మీ 16 ప్రో సిరీస్ లాంచ్ గురించి మాత్రమే రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ సిరీస్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్ కోసం కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ టీజర్ ఇమేజెస్ రిలీజ్ చేసింది.
రియల్ మీ 16 ప్రో సిరీస్ ఫోన్లను నెక్స్ట్ జనరేషన్ మాస్టర్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ క్వాడ్ కర్వుడ్ డిస్ప్లే మరియు వెనుక కూడా కర్వుడ్ డిజైన్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ అప్ కమింగ్ సిరీస్ ఫోన్లు పెర్ఫార్మెన్స్ లో కాంప్రమైజ్ కానీ ఫాస్ట్ ప్రోసెసర్ తో వస్తాయని రియల్ మీ తెలిపింది.
రియల్ మీ అందించిన టీజర్ ఇమేజ్ నుంచి ఈ సిరీస్ ఫోన్లు క్వాల్కమ్ చిప్ సెట్ తో లాంచ్ అవుతాయని తెలిపింది. ఈ సిరీస్ ఫోన్లు సెగ్మెంట్ బెస్ట్ కెమెరా సెటప్ తో వస్తుందని కూడా రియల్ మీ టీజింగ్ చేసింది. ఈ సిరీస్ నుంచి వచ్చే ఫోన్లలో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుందని కూడా రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్లు 1x నుంచి 10x వరకు గొప్ప డీటెయిల్స్ కలిగిన సూపర్ పోర్ట్రైట్ ఫోటోలు అందిస్తుందని రియల్ మీ చెబుతోంది.
Also Read: Save the Tigers Season 3 గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసిన జియో హాట్ స్టార్.. రిలీజ్ ఎప్పుడంటే.!
రియల్ మీ ఫోన్ కెమెరా కోసం ప్రత్యేకంగా అందించిన AI Edit Genie ఈ సిరీస్ లో కూడా అందిస్తుంది. అదికూడా లేటెస్ట్ ఎఐ ఎడిట్ జీనీ 2.0 సపోర్ట్ తో అందిస్తుంది. ఈ ఫీచర్ తో అనేకమైన ఫిల్టర్లు మరియు ఇతర ఫీచర్లు ఉంటాయి.
రియల్ మీ 16 ప్రో సిరీస్ లాంచ్ డేట్ మరియు ఈ అప్ కమింగ్ సిరీస్ కీలక ఫీచర్లు కూడా త్వరగానే విడుదల చేసే అవకాశం ఉంది.