Realme 16 Pro Plus 5G: కంపెనీ కన్ఫర్మ్ చేసిన టాప్ 5 ఫీచర్లు ఇవే.!
రియల్మీ 16 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ కంపెనీ రివీల్ చేసింది
టాప్ ఫీచర్స్ బయటకు వెల్లడించి ఈ ఫోన్ పై మరింత హైప్ పెంచింది
ఈ రియల్మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఏమిటో చూద్దామా
Realme 16 Pro Plus 5G: రియల్మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ హైఎండ్ ఫోన్ రియల్మీ 16 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ కంపెనీ రివీల్ చేసింది. రియల్మీ నంబర్ సిరీస్ లో ఎప్పుడూ చూడని కొత్త డిజైన్ తో ఈ ఫోన్ ను రియల్మీ ఇండియాలో అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్స్ బయటకు వెల్లడించి ఈ ఫోన్ పై మరింత హైప్ పెంచింది. ఈ రియల్మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఏమిటో చూద్దామా.
SurveyRealme 16 Pro Plus 5G: టాప్ 5 ఫీచర్స్
సాదరంగా ప్రతి ఫోన్ లో కూడా ఐదు ముఖ్యమైన విభాగాల గురించి ఎక్కువగా చెక్ చేస్తుంటారు. వాటిలో, చిప్ సెట్, బ్యాటరీ, ర్యామ్, డిస్ప్లే మరియు కెమెరా ఉంటాయి. రియల్మీ అప్ కమింగ్ ఫోన్ కలిగిన ఈ ఐదు విభాగాల వివరాలు కంపెనీ పూర్తిగా వెల్లడించింది. ఈ స్పెక్స్ మరియు ఫీచర్స్ ద్వారా ఈ ఫోన్ గురించి ఒక అంచనా వచ్చేలా చేసింది.

డిజైన్
ఈ ఫోన్ రియల్మీ నంబర్ సిరీస్ లో ఎప్పుడూ చూడని కొత్త మాస్టర్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ భారతీయ యువత కోసం అందించిన ప్రత్యేకమైన కలర్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ మరియు అర్బన్ వైల్డ్ డిజైన్ తో ఉంటుంది.
డిస్ప్లే
ఈ రియల్మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ భారీ 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన హైపర్ గ్లో 4D కర్వ్ ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. ఇది స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, నెట్ ఫ్లిక్స్ HDR సర్టిఫికేషన్ మరియు 1.48mm అల్ట్రా థిన్ బెజెల్స్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ప్రోసెసర్
ఈ ఫోన్ ను క్వాల్కమ్ కొత్తగా అందించిన Snapdragon 7 Gen 4 చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. ఇది 1.44Mn AnTuTu స్క్రీన్ అం`అందించే శక్తి కలిగి ఉంటుంది. ఈ ప్రోసెసర్ కి జతగా 12 జీబీ LPDDR5x ర్యామ్ మరియు 512 జీబీ హెవీ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఇది ఈ ఫోన్ పెర్ఫార్మన్స్ ని పీక్స్ లో అందించడానికి సహాయం చేస్తుంది.
కెమెరా
ఈ ఫోన్ కెమెరా సెటప్ గురించి రియల్మీ ప్రత్యేకంగా చెబుతోంది. ఎందుకంటే, ఈ ఫోన్ లో 200MP ప్రధాన సెన్సార్ జతగా 50MP పెరిస్కోప్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇది సూపర్ రిజల్యూషన్ తో ఫోటోలు మరియు వీడియోలు అందించడమే కాకుండా జబర్దస్త్ Ai కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో AI ఎడిట్ జీనీ 2.0 మరియు Ai కెమెరా ఫీచర్స్ కూడా ఉన్నాయి.
Also Read: 2026 New Year Wishes: AI సహాయంతో న్యూ ఇయర్ విషెస్ సరికొత్తగా చెప్పండి.!
బ్యాటరీ
ఈ ఫోన్ ను 700 mAh బిగ్ బ్యాటరీతో విడుదల చేస్తున్నట్లు రియల్మీ ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ కలిగిన స్లీక్ డిజైన్ లో ఇది బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ యొక్క మరిన్ని అదనపు ఫీచర్స్ కూడా రియల్మీ వెల్లడించింది. ఈ ఫోన్ ను రియల్మీ UI 7.0 జతగా ఆండ్రాయిడ్ 16OS తో లాంచ్ చేస్తున్నట్లు రియల్మీ తెలిపింది. ఇది 3 మేజర్ అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందుకుంటుంది. రియల్మీ 16 ప్రో ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇది IP66,IP68, IP69 మరియు IP69K రేటింగ్ తో ఎక్స్ ట్రీమ్ కండిషన్స్ కూడా తట్టుకునే ఫీచర్ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.