Realme 13 Pro Series 5G డిజైన్ ను సింపుల్ గా పీస్ ఆఫ్ ఆర్ట్ అని చెబుతోంది కంపెనీ.!

HIGHLIGHTS

Realme 13 Pro Series 5G నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ డిజైన్ గురించి సింపుల్ గా ‘పీస్ ఆఫ్ ఆర్ట్’ అని చెబుతోంది కంపెనీ

ఈ ఫోన్ కెమెరా గురించి ముందు నుంచే గొప్పగా చెబుతోంది

Realme 13 Pro Series 5G నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ డిజైన్ గురించి సింపుల్ గా ‘పీస్ ఆఫ్ ఆర్ట్’ అని చెబుతోంది కంపెనీ. ఈ ఫోన్ డిజైన్ ను బయటపెట్టిన కంపెనీ ఈ ఫోన్ కెమెరా గురించి ముందు నుంచే గొప్పగా చెబుతోంది. ఈ అప్ కమింగ్ రియల్‌మీ ఫోన్ ఎలా ఉందో ఒక లుక్కేద్దాం పదండి.

Realme 13 Pro Series 5G

రియల్‌మీ ఇండియాలో 13 ప్రో సిరీస్ 5జి స్మార్ట్ ఫోన్ లను త్వరలో విడుదల చేసినట్లు తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ ని ఇంకా ప్రకటించని కంపెనీ, ఈ ఫోన్ ఫీచర్స్ తో టీజింగ్ చేయడం మాత్రం మొదలు పెట్టింది. ఈ ఫోన్ కెమెరా గురించి గొప్పగా చెప్పిన కంపెనీ, ఇప్పుడు ఈ ఫోన్ డిజైన్ గురించి పొగడడం మొదలు పెట్టింది.

Realme 13 Pro Series 5G

రియల్‌మీ 13 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్ లను ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిస్ట్ మోనెట్ డిజైన్ తో తీసుకు వస్తునట్లు తెలిపింది. ఇందులో మిరాకిల్ షైనింగ్ గ్లాస్ మరియు సన్ రైజ్ హ్యాలో ఉన్నట్లు తెలిపింది. ఇందులో లైట్ మరియు షాడో ల మధ్య ఫ్లో ని ఫీల్ అయ్యేలా చేస్తుందని రియల్‌మీ చెబుతోంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ రౌండ్ కార్నర్ మరియు కర్వ్డ్ బ్యాక్ తో అందంగా కనిపిస్తుంది.

Also Read: Oppo Reno 12 Series 5G ను ఇండియాలో విడుదల చేసిన ఒప్పో.. ప్రైస్ ఎంతంటే.!

Realme 13 Pro Series 5G: కెమెరా

ఇప్పటివరకు ఈ ఫోన్ డిజైన్ గురించి చెబితే, ఈ ఫోన్ లో కెమెరా గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఫోన్ లో AI సపోర్ట్ కలిగిన వరల్డ్స్ 1st అల్ట్రా క్లియర్ కెమెరా ఉన్నట్లు రియల్‌మీ తెలిపింది. ఇందులో, AI అల్ట్రా క్లారిటీ, AI స్మార్ట్ లూప్, AI స్మార్ట్ రిమూవల్ మరియు AI నైట్ విజన్ మోడ్ వంటి చాలా AI ఫీచర్లు ఉండే అవకాశం వుంది.

ఈ ఫోన్ యొక్క కెమెరా ఫీచర్ లను జూలై 15న విడుదల చేస్తుందని రియల్‌మీ పేర్కొంది. ఈ ఫోన్ లో గొప్ప కెమెరా వివరాలు అందించడానికి HyperImage+ ను డెవలప్ చేసినట్టు కూడా రియల్‌మీ చెబుతోంది. రియల్‌మీ చెబుతున్న ఈ విషయాలు చూస్తుంటే, ఈ ఫోన్ ను భారీ ఫీచర్స్ తో లాంచ్ చేస్తుందని అర్థం అవుతోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :