ఆసక్తి రేపుతున్న Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లీక్స్.!

HIGHLIGHTS

Realme 11 Pro+ 5G ఫోటోలు ఆన్లైన్ లో లీకయ్యాయి

ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు ప్రత్యేకతలతో కనిపిస్తోంది

ఈ ఫోన్ యొక్క కెమేరా సెటప్ కూడా సరికొత్తగా కనిపిస్తోంది

రియల్ మి యొక్క అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గా చెప్పబడుతున్న Realme 11 Pro+ 5G యొక్క ఫోటోలు ఆన్లైన్ లో లీకయ్యాయి. లీకైన ఈ Realme 11 Pro+ 5G వివరాలు ఇప్పడు నెట్టింట్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు ప్రత్యేకతలతో కనిపిస్తోంది. ఈ ఫోన్ గురించి ఇప్పటికే గురించి చాలా విషయాలు ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మరి రియల్ మి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క లీకైన ఇమేజిలు మరియు దాని కొత్త సంగతులు ఏమిటో తెలుసుకుందామా.

లీకైన ఈ ఇమేజిలలో Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ సరికొత్త డిజైన్ లో కనిపిస్తోంది. ఈ ఫోన్ యొక్క కెమేరా సెటప్ కూడా సరికొత్తగా కనిపిస్తోంది. ఈ ఫోన్ యొక్క బ్యాక్ ప్యానల్ లో పై భాగంలో గుండ్రంగా పెద్దగా కనిపిస్తోంది. ఈ కెమేరా సెటప్ లో ఉన్న కెమేరాల గురించి కూడా లీక్డ్ ఫొటోలు వెల్లడించాయి. 

ఈ ఫోన్ లో 200MP ప్రైమరీ కెమేరా, 8MP అల్ట్రా- వైడ్ యాంగిల్ మరియు మ్యాక్రో కెమేరా లతో ఉండవచ్చు. ముఖ్యంగా, ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ మధ్యలో ఒక గోల్డెన్ కలర్ స్టిఫ్ తో కూడా వేగాన్ లెథర్ తో కనిపిస్తోండి. ఇది ఫోన్ ను మరింత అందంగా కనిపించేలా చేస్తోంది. 

Realme 11 Pro+ 5G: అంచనా స్పెక్స్

రియల్ మి 11 ప్రో+ 5G యొక్క అంచనా ధరలను కూడా ఆన్లైన్ లీక్స్ వెల్లడిస్తున్నాయి. వీటి ద్వారా ఈ ఫోన్ 6.7 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్ మీడియాటెక్ Dymensity 7000 సిరీస్ ప్రోసెసర్ తో రావచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ మరియు Adnroid 13OS తో రావచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :