Redmi Note 10T 5G: జూలై 20 న వస్తున్న మరొక బడ్జెట్ 5G ఫోన్

Updated on 14-Jul-2021
HIGHLIGHTS

Redmi Note 10T 5G లాంచ్ డేట్ సెట్

స్పెక్స్ పరంగా పోకో ఎం 3 ని పోలి ఉంటుంది

బడ్జెట్ ధరలో వస్తుందని రూమర్

షియోమి తన Redmi Note 10T 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి డేట్ సెట్ చేసింది. ఇటీవల రష్యన్ మార్కెట్లో విడుదచేసిన రెడ్‌మి నోట్ 10 టి ను జూలై 20 న ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల చేస్తోంది. ఈ రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ స్పెక్స్ పరంగా పోకో ఎం 3 ని పోలి ఉంటుంది. ఎందుకంటే, రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ బడ్జెట్ 5G ప్రొసెసర్ Dimensity 700 తో రష్యన్ మార్కెట్లో విడుదల చేయయ్యబడింది.

ఈ ఫోన్ లాంచ్ డేట్ గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ, రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ ను అమెజాన్ ఇండియా ద్వారా తీసుకురాబోతున్నట్లు టీజ్ చేస్తోంది. అంటే, ఈ రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్ ఇండియాలో మాత్రమే లభిస్తుంది. రష్యన్ మార్కెట్లో ఈ రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ యొక్క 4జీబీ ర్యామ్ మరియు 128జీబీ స్టోరేజ్ వేరియంట్ RUB 19,990 రేటుతో అందించింది. అంటే, మన కరెన్సీలో సుమారు రూ.20,500 రూపాయలు.

ఇక రష్యాలో విడుదల చేసిన రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ ప్రధాన స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, రెడ్‌మి నోట్ 10 టి స్మార్ట్‌ఫోన్‌ 6.5 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ Dimensity 700 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 48MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయి. రెడ్‌మి నోట్ 10 టి లో 18W ఫాస్ట్ ఛార్జింగ్  సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీ ఉంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :