Poco X8 5G లాంచ్ కోసం టీజింగ్ స్టార్ట్ .. జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ కావచ్చని అంచనా.!

HIGHLIGHTS

Poco X8 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కోసం టీజింగ్ స్టార్ట్ చేసింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం టీజర్ ని విడుదల చేసింది

పోకో ఎక్స్ 8 ప్రో మాదిరి డిజైన్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది

Poco X8 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కోసం టీజింగ్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఒప్పో ఎక్స్ 8 సిరీస్ నుంచి ప్రీమియం వేరియంట్ ఫోన్ ఇండియాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సిరీస్ నుంచి స్టాండర్డ్ స్మార్ట్ ఫోన్ కూడా చేయబోతున్నట్లు పోకో వెల్లడించింది. వాస్తవానికి, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డీటెయిల్స్ ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం లాంచ్ టీజర్ ని మాత్రం విడుదల చేసింది.

Poco X8 5G లాంచ్ డేట్

పోకో ఎక్స్ 8 5g స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని పోకో ఇంకా రివీల్ చేయలేదు. అంటే, ఈ అప్ కమింగ్ నుంచి స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం టీజర్ ని మాత్రం విడుదల చేసింది. ఈ ఫోన్ కోసం కూడా ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ చేసింది. అంతేకాదు, ఫ్లిప్ కార్ట్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ కూడా అందించింది. ఈ ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క వివరాలు కూడా వెల్లడించడం ప్రారంభించింది.

Also Read : Vivo Y31t: వివో న్యూ ఫోన్ అదిరే డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Poco X8 5G : ఫీచర్స్

పోకో ఎక్స్ 8 5g స్మార్ట్ ఫోన్ టీజర్ పేజీలో ఈ ఫోన్ యొక్క డిజైన్ ని వెల్లడించే ఇమేజ్ ను రిలీజ్ చేసింది. ఈ ఇమేజ్ లో ఈ అప్ కమింగ్ పోకో స్మార్ట్ ఫోన్ పోకో ఎక్స్ 8 ప్రో మాదిరి డిజైన్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కొంచెం మందమైన డిజైన్ ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే, ఈ ఫోన్ భారీ బ్యాటరీ కలిగి ఉంటుందని అంచనా వేయవచ్చు. అలాగే, ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉన్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇతర వివరాలు ఇంకా వెల్లడించలేదు.

పోకో ఎక్స్ 8 5జి అంచనా ఫీచర్స్

పోకో ఎక్స్ 8 5జి అంచనా ఫీచర్స్ ఇప్పటికే ఎక్స్ ప్లాట్ ఫామ్ లో చక్కర్లు కొడుతున్నాయి. వీటి ప్రకారం, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6.83 ఇంచ్ బిగ్ AMOLED స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్ మరియు 120HZ రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ 5జి చిప్ సెట్ Snapdragon 6s Gen 4 తో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని కూడా అంచనా వేసి చెబుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :