రేపు విడుదలకానున్న POCO X2 : 27W స్పీడ్ ఛార్జింగ్ మరియు 120Hz స్మూత్ డిస్ప్లే కన్ఫర్మ్

HIGHLIGHTS

ఈ ఫోన్ను కొన్ని హై ఎండ్ స్పెక్స్ తో ఈ ఫోన్ను ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు చెబుతోంది.

ఇండియాలో ఫిబ్రవరి 4 వ తేదికి, అంటే రేపు ,మధ్యాహ్నం 12 గంటలకి  POCO తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి POCO X2 ని విడుదల చెయ్యడానికి  సిద్దమవుతోంది.  ఇదే సంస్థ నుండి ముందుగా వచ్చినటువంటి POCO F1 ఫోన్, కేవలం మిడ్ రేంజ్ ధరలో వేగవంతమైన స్నాప్ డ్రాగన్ 845 SoC తో వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరింత దూకుడుగా వస్తోన్న ఈ సంస్థ, ఈ ఫోన్ను కొన్ని హై ఎండ్ స్పెక్స్ తో ఈ ఫోన్ను ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు చెబుతోంది.

ఈ ఫోన్ కోసం flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అందించిన టీజర్ ప్రకారం, ఈ ఫోన్ను స్మూత్ మరియు స్పీడ్ టచ్ రెస్పాన్స్ అందించే, ఒక గొప్ప 120Hz రిఫ్రెష్ రేటుకలిగిన డిస్ప్లేతో ఈ ఫోను రానునట్లు చెబుతోంది. అంతేకాదు, ఈ డిస్ప్లే తో మంచి రెస్పాన్స్ మరియు సూపర్ గేమింగ్ కూడా చూడవచ్చని చెబుతోంది. వాస్తవానికి, ఎక్కువ రిఫ్రెష్ కలిగిన డిస్ప్లేలలో, గ్రాఫిక్స్మరియు యానిమేషన్లు మరింత అద్భుతంగా మరియు స్పీడ్ గా ఉంటాయి. కాబట్టి ఈ డిస్ప్లే ఎక్కువ ఆకట్టుకునేదిగా ఉంటుంది.

ఇక ఇందులో అందించిన ఛార్జింగ్ టెక్నలాజి గురించి కూడా గొప్పగానే చెబుతోంది. ఇందులో, ఒక 27W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ని అందించి నాట్లు ప్రకటించింది మరియు  ఇది చాల వేగంగా ఫోన్ను ఛార్జ్ చేస్తుందని చెబుతోంది. ఇక కెమెరాల విషయంలో, ఈ ఫోన్ను ఒక పెద్ద కెమెరాతో తేనున్నట్లు తీజ్ చేస్తోంది మరియు ఇక్కడ 6:6 అని చూపిస్తోందో. అంటే, ఇది 64 MP కెమేరా అని అనిపిస్తోంది. అయితే, ఇది ప్రత్యేకముగా దీని గురించి చెబుతోంది కాబట్టి ఇది కొత్త సెన్సార్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.                                                

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :