Poco M8 Power: 16GB ర్యామ్ మరియు 8000 mAh బ్యాటరీ వంటి భారీ ఫీచర్స్ తో రేపు లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

Poco M8 Power రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది

16GB ర్యామ్ మరియు 8000 mAh బ్యాటరీ వంటి భారీ ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది

పోకో ఎం 8 పవర్ ఫోన్ క్వాల్కమ్ ఎక్క లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon Gen 4 తో లాంచ్ అవుతుంది.

Poco M8 Power: పోకో గత కొన్ని రోజులుగా టీజింగ్ చేస్తున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పోకో ఎం8 పవర్ స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 16GB ర్యామ్ మరియు 8000 mAh బ్యాటరీ వంటి భారీ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు పోకో పేర్కొంది. ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని కెమెరా వరకు చాలా ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంది. రేపు లాంచ్ కాబోతున్న ఈ ఫోన్ ఫీచర్స్ మరియు అంచనా ప్రైస్ ఈ రోజే తెలుసుకోండి.

Poco M8 Power: ఫీచర్స్

పోకో ఎం 8 పవర్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ ఎక్క లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon Gen 4 తో లాంచ్ అవుతుంది. ఇది సపోర్ట్ కలిగిన 4nm ప్రాసెసర్ మరియు ఇది 6,30,000 కంటే అధిక AnTuTu స్కోర్ ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను మరింత వేగంగా డ్రైవ్ చేయడానికి వీలుగా 16GB ర్యామ్ (8GB + 8GB) సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూలింగ్ కోసం పెద్ద గ్రాఫైట్ కూలింగ్ ఏరియా ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది మంచి వీడియోలు మరియు స్టన్నింగ్ ఫోటోలు అందిస్తుందని పోకో తెలిపింది. మంచి కలర్స్ మరియు విజువల్స్ కోసం ఈ ఫోన్ లో పెద్ద 6.9 ఇంచ్ AMOLED స్క్రీన్ ని పోకో ఆఫర్ చేసింది. ఇది FHD రిజల్యూషన్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz వంటి అదనపు ఫీచర్స్ తో పాటు చాలా గొప్ప రక్షణ అందించే గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కూడా కలిగి ఉంటుంది.

ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ పేరుకు తగ్గట్టుగానే 8000 mAh పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, మరియు 22.5W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటాయి. ఇది కాకుండా IP65 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Hyper OS3 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది. ఈ ఫోన్ 4 జనరేషన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ మరియు 6 సంవత్సరాల సాఫ్ట్ వేర్ అప్‌డేట్ అందుకుంటుంది.

Also Read : Smart Homes మన జీవనశైలిని ఎలా మారుస్తున్నాయి.!

Poco M8 Power: అంచనా ప్రైస్

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఇంకా రివీల్ కాలేదు. అయితే, ఈ ఫోన్ అంచనా ప్రైస్ ఆన్లైన్ లో కీ అయ్యింది. ఆన్లైన్ లో లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ ఫోన్ రూ. 14,999 నుంచి రూ. 18,999 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, రేపు ఈ మాటల్లో నిజం ఎంత ఉందో తెలిసే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :