Poco M6 5G Launch: చవక ధరలో కొత్త 5జి ఫోన్ లాంచ్ చేస్తున్న పోకో.!
చవక ధరలో కొత్త 5జి ఫోన్ లాంచ్ చేస్తున్న పోకో
ప్రొకో ఎం6 5జి ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది పోకో
ఈ ఫోన్ ను చవక ధరలో అందిస్తున్నట్లు కూడా నొక్కి మరి చెబుతోంది
Poco M6 5G Launch: చవక ధరలో కొత్త 5జి ఫోన్ లాంచ్ చేస్తున్న పోకో. ఈ మాట స్వయంగా పోకో నే అనౌన్స్ చేసింది. పోకో బడ్జెట్ సీరీస్ గా పేరొందిన M సిరీస్ నుండి నెక్స్ట్ జెనరేషన్ ఫోన్ ప్రొకో ఎం6 5జి ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది పోకో. ఈ ఫోన్ ను డిసెంబర్ 22న ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయబోతున్నట్లు పోకో తెలిపింది. ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ పేజ్ నుండి ఈ ఫోన్ ను చవక ధరలో అందిస్తున్నట్లు కూడా నొక్కి మరి చెబుతోంది.
SurveyPoco M6 5G Launch

పోకో ఎం6 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ టీజర్ ను Flipkart ప్లాట్ ఫామ్ ద్వారా పోకో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన పేజ్ ను అందించింది మరియు ఈ పేజ్ ద్వారా కొన్ని స్పెక్స్ ను కూడా వెల్లడించింది. ఫ్లిప్ కార్ట్ టీజర్ టీజర్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ మరియు ప్రోసెసర్ వివరాలను అందించింది.
ముఖ్యంగా, ఈ ఫోన్ గురించి ‘The Most Affordable 5G is Here’ అని చెబుతోంది. అంటే, ఈ ఫోన్ అత్యంత సరసమైన 5జి అని కంపెనీ హింట్ ఇచ్చిందన్న మాట. అయితే, ఈ ఫోన్ రేటు ను ఎలా ఉంచుతుందో వేసి చూడాలి.
Also Read : Redmi Note 13 Pro+ 5G ఫోన్ ను వాటర్ రెసిస్టెంట్ వంటి భారీ ఫీచర్లతో లాంచ్ చేస్తోంది.!
పోకో ఎం6 5జి ప్రత్యేకతలు
పోకో ఎం6 5జి యొక్క కొన్ని ప్రత్యేకతలను లాంచ్ కంటే ముందుగానే కంపెనీ అందించింది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimesity 6100+ 5G ప్రోసెసర్ తో లాంచ్ చేస్తునట్టు పోకో టీజర్ చెబుతోంది. ఇది మీడియాటెక్ లేటెస్ట్ గా తీసుకు వచ్చిన కొత్త బడ్జెట్ 5జి ప్రోసెసర్. ఇక ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్ తో వస్తున్నట్లు అర్ధం చేసుకోవచ్చు.

ఈ ఫోన్ ఇమేజ్ లో ఈ ఫోన్ 50MP AI డ్యూయల్ రియర్ కెమేరాని కలిగి ఉన్నట్లు చూపించింది. ఈ ఫోన్ లో వాటర్ డ్రాప్ డిజైన్ డిస్ప్లే ఉన్నట్లు కూడా మనం చూడవచ్చు. అలాగే, ఈ డిస్ప్లే సన్నని అంచులను కలిగి వుంది మరియు స్లీక్ డిజైన్ తో కనిపిస్తోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
