POCO M4 Pro 5G ఫస్ట్ సేల్ నుండి భారీ అఫర్: రేపు మద్యహ్నం జరగనున్న సేల్
POCO M4 Pro 5G ప్రోసెసర్ మరియు DCI-P3 డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వచ్చింది
షియోమి ఇటీవల ఇండియాలో తన బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ POCO M4 Pro 5G ను ప్రవేశపెట్టింది. పోకో ఎం3 ప్రో అప్గ్రేడ్ వెర్షన్ గా తీసుకొచ్చిన పోకో M4 Pro గొప్ప ఫీచర్లతో పాటుగా ఆకర్షణీయమైన ధరతో ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఈ పోకో లేటెస్ట్ ఫోన్ 5G ప్రోసెసర్ మరియు DCI-P3 డిస్ప్లే వంటి మరిన్ని బెస్ట్ ఫీచర్లతో వచ్చింది. ఇండియన్ మార్కెట్ లో కొనసాగుతున్న 5G ఫోన్లకు పోటీ ధరతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.
SurveyBank Offer: రేపు జరగనున్న ఫస్ట్ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ను SBI క్రెడిట్/ డెబిట్ కార్డ్ లేదా కార్డ్ EMI అఫర్ ద్వారా కొనేవారికి 1,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ అఫర్ ను అందించింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు Flipkart నుండి ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది.
POCO M4 Pro 5G: ధర
POCO M4 Pro 5G మూడు వేరియంట్ లలో వస్తుంది. వీటిలో బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో కేవలం రూ. 14,999 ధరతో వచ్చింది. రెండవ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ. 16,999 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ. 18,999 ధరతో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ కూల్ బ్లూ, పవర్ బ్లాక్ మరియు ఎల్లో మూడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.
POCO M4 Pro 5G: స్పెక్స్
ఈ POCO M4 Pro 5G ఫోన్ పెద్ద 6.6 అంగుళాల FHD+ పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఇది DCI-P3 సపోర్ట్ డిస్ప్లేతో ఉంటుంది మరియు ఎండలో కూడా చక్కగా కనిపిస్తుంది. ఈ ఫోన్‌లో లేటెస్ట్ మీడియాటెక్ 5G ప్రోసెసర్ డైమెన్సిటీ 810 SoC ని కలిగి వుంది. ఈ ప్రొసెసర్ గరిష్టంగా 2.4 Ghz స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ SoC మరియు Arm Mali-G57 MC2 GPU తో జతగా ఉంటుంది మరియు 6nm ప్రోసెసర్. ఇది మంచి గేమింగ్ మరియు 5G సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన MIUI 12.5 స్కిన్ పైన నడుస్తుంది.
పోకో ఎం4 ప్రో 5G వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చింది. అయితే, ఇది ఎక్కువ కెమెరాలతో ఉన్నట్లుగా కనిపించేలా డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో 50ఎంపి ప్రధాన కెమెరా మరియు 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా అందించింది మరియు LED ఫ్లాష్ లైట్ ను కూడా కెమెరాతో జతగా ఇచ్చింది. ముందుభాగంలో, 16ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.
పోకో ఎం4 ప్రో 5G ఫోన్ 5000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను సైడ్ లో ఇచ్చింది మరియు AI ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ వుంది. ఇందులో డ్యూయల్ స్పీకర్లు కూడా అందించింది.