ఇంత చవక ధరకే పోకో 5G ఫోన్ లాంచ్ చేసిందా?

ఇంత చవక ధరకే పోకో 5G ఫోన్ లాంచ్ చేసిందా?
HIGHLIGHTS

POCO M3 Pro 5G స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరకే వచ్చింది

ఈ లేటెస్ట్ పోకో 5G స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 700 చిప్ సెట్ తోవచ్చింది

90 Hz రిఫ్రెష్ రేట్ డైనమిక్ స్విచ్ డాట్ డిస్ప్లే మరియు మరిన్ని ఫీచర్లను కలిగివుంది

నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యబడిన POCO M3 Pro 5G స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరకే వచ్చింది. ఈ లేటెస్ట్ పోకో 5G స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 700 చిప్ సెట్ తోవచ్చింది. అంతేకాదు, ఈ పోకో 5G ఫోన్ కొత్త ఫోన్ ఆసక్తికరమైన డిజైన్ తో పాటుగా మంచి 90 Hz రిఫ్రెష్ రేట్ డైనమిక్ స్విచ్ డాట్ డిస్ప్లే మరియు మరిన్ని ఫీచర్లను కలిగివుంది.

ఈ ఫోన్ యొక్క ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ ప్రపంచ మార్కెట్లో 4GB + 64GB బేసిక్ వేరియంట్ ని 159 యూరోలు(సుమారు 14,000 ధర) వద్ద ప్రకటించింది. ఇందులోనే, హై ఎండ్ వేరియంట్ 6GB + 128GB వేరియంట్ ని 179 యూరోలు(సుమారు 16,000 ధర) వద్ద ప్రకటించింది. పోకో ఎం3 ప్రో 5G కూల్ బ్లూ, పవర్ బ్లాక్, పోకో ఎల్లో అనే మూడు ఆకర్షిణీయమైన రంగుల్లో లభిస్తుంది.

పోకో ఎం 3 ప్రో 5 జి: స్పెషిఫికేషషన్స్

ఇక ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పోకో ఎం 3 ప్రో 5 జి యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల FHD + రిజల్యూషన్ డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90 Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది. అధనముగా, ఈ డిస్ప్లే డైనమిక్ స్విచ్ ఫీచర్ మరియు 1,500: 1 కాంట్రాస్ట్ రేషియోకు మద్దతు ఇస్తుంది.

ఇక ఫోన్ ప్రాసెసర్ పరంగా, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC తో వస్తుంది, ఇది 6GB RAM వరకు మరియు 128GB వరకు స్టోరేజ్ తో జతగా వస్తుంది. ఇందులోని కెమెరా సెటప్, వెనుక భాగంలో ట్రిపుల్-లెన్స్ సెటప్ ఉంది, ఇందులో ఎఫ్ / 1.79 ఎపర్చర్‌ తో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. అలాగే, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌ తో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌ తో మరో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ కెమెరా నైట్ మోడ్, AI కెమెరా 5.0, మూవీ ఫ్రేమ్, టైమ్ లాప్స్, స్లో మోషన్ వీడియో మరియుమ్యాక్రో మోడ్‌తో సహా అనేక ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

సెల్ఫీల కోసం, మూవీ ఫ్రేమ్ వంటి ఫీచర్లకు మద్దతునిచ్చే f / 2.0 ఎపర్చర్‌ తో 8 మెగాపిక్సెల్ లెన్స్ ఉంది. ఇది కాకుండా, పోకో ఎం 3 ప్రో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు AI ఫేస్ అన్‌ లాక్‌ తో వస్తుంది. ఈ పోకో ఎం 3 ప్రో 5 జి స్మార్ట్ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అందించబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo