ఇటీవల, పోకో ఇండియాలో చౌక ధరలో ప్రీమియం ఫీచర్లతో తీసుకువచ్చిన POCO M2 Pro స్మార్ట్ ఫోన్ యొక్క సెకండ్ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి మొదలవుతుంది. POCO M2 Pro లో 6.67-అంగుళాల Full-HD + డిస్ప్లే, ముందు మరియు వెనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కలిగి ఉంది. ఇంకా, ఇది 8nm, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC తో పాటు 6GB LPDDR4X RAM మరియు 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వంటి ఫీచర్లతో వస్తుంది, కానీ దీని రేటును మాత్రం అతితక్కువగా నిర్ణయించింది.
పోకో ఎం 2 ప్రో ధరల గురించి క్లుప్తంగా చూస్తే: 4 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ వేరియంట్ రూ .13,999 ధరతో, 6 GB ర్యామ్ + 64 GB జిబి స్టోరేజ్ వేరియంట్ రూ .14,999 ధరతో మరియు 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ .16,999 ధరతో ప్రకటించబడింది . M2 Pro యొక్క సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్ కార్ట్ లో మొదలు అవుతుంది.
ఈ Poco M2 Pro స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో తీసుకొచ్చింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది మరియు అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 5 పొరతో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో చదరపు ఆకారంలో గల కెమెరా సెటప్ ఉంది మరియు 209 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 8.8 మిమీ మందంతో వస్తుంది.
ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720 జి ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 10-ఆధారిత MIUI 11 పై పోకో లాంచర్‌తో నడుస్తుంది. ఈఫోనే మరింత స్టోరేజి విస్తరణ కోసం ప్రత్యేకమైన మైక్రో SD కార్డును కలిగి ఉంది.
పోకో M2 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48MP కెమెరాని f / 1.8 ఎపర్చరుతో, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ తో , 5MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ కలుపుకుంది. వెనుక కెమెరాలు 4K UHD రీకార్డింగ్ ని 30FPS వద్ద మరియు స్లో-మోషన్ వీడియోలను HD లో 960FPS వరకు షూట్ చేయగలవు. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో పంచ్-హోల్ కటౌట్ లోపల 16 MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది.