చౌక ధరలో ప్రీమియం ఫీచర్లతో వచ్చిన POCO M2 Pro సెకండ్ సేల్

చౌక ధరలో ప్రీమియం ఫీచర్లతో వచ్చిన POCO M2 Pro సెకండ్ సేల్
HIGHLIGHTS

పోకో ఇండియాలో చౌక ధరలో ప్రీమియం ఫీచర్లతో తీసుకువచ్చిన POCO M2 Pro స్మార్ట్ ఫోన్ యొక్క సెకండ్ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి మొదలవుతుంది.

POCO M2 Pro లో 6.67-అంగుళాల Full-HD + డిస్ప్లే, ముందు మరియు వెనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కలిగి ఉంది.

POCO M2 Pro ఒక 8nm, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC తో పాటు 6GB LPDDR4X RAM మరియు 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వంటి ఫీచర్లతో వస్తుంది,

ఇటీవల, పోకో ఇండియాలో చౌక ధరలో ప్రీమియం ఫీచర్లతో తీసుకువచ్చిన POCO M2 Pro స్మార్ట్ ఫోన్ యొక్క సెకండ్ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి మొదలవుతుంది. POCO M2 Pro లో 6.67-అంగుళాల Full-HD + డిస్ప్లే, ముందు మరియు వెనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కలిగి ఉంది. ఇంకా, ఇది 8nm, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC తో పాటు 6GB LPDDR4X RAM మరియు 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వంటి  ఫీచర్లతో వస్తుంది, కానీ దీని రేటును మాత్రం అతితక్కువగా  నిర్ణయించింది. 

Poco M2 Pro సెకండ్ సేల్ మరియు ధర

పోకో ఎం 2 ప్రో ధరల గురించి క్లుప్తంగా చూస్తే: 4 GB ర్యామ్ + 64 GB  స్టోరేజ్ వేరియంట్ రూ .13,999 ధరతో, 6 GB ర్యామ్ + 64 GB జిబి స్టోరేజ్ వేరియంట్ రూ .14,999 ధరతో మరియు 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ .16,999 ధరతో ప్రకటించబడింది . M2 Pro యొక్క సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్ కార్ట్ లో మొదలు అవుతుంది.

Poco M2 Pro Specs

ఈ Poco M2 Pro స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో తీసుకొచ్చింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది మరియు అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 5 పొరతో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో చదరపు ఆకారంలో గల కెమెరా సెటప్  ఉంది మరియు 209 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 8.8 మిమీ మందంతో వస్తుంది.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720 జి ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్  ఎంపికలతో జతచేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 10-ఆధారిత MIUI 11 పై పోకో లాంచర్తో నడుస్తుంది. ఈఫోనే మరింత స్టోరేజి విస్తరణ కోసం ప్రత్యేకమైన మైక్రో SD కార్డును కలిగి ఉంది.

పోకో M2 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48MP కెమెరాని f / 1.8 ఎపర్చరుతో, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ తో , 5MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ కలుపుకుంది. వెనుక కెమెరాలు 4K UHD రీకార్డింగ్ ని 30FPS వద్ద మరియు స్లో-మోషన్ వీడియోలను HD లో 960FPS వరకు షూట్ చేయగలవు. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో పంచ్-హోల్ కటౌట్ లోపల 16 MP  సెల్ఫీ కెమెరా ఉంది.

ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo