Poco M2 కేవలం బడ్జెట్ ధరలో 6GB ర్యామ్, మరిన్ని ఫీచర్లతో వచ్చింది

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 08 Sep 2020
HIGHLIGHTS
  • షియోమి సబ్ బ్రాండ్ పోకో తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోనుగా Poco M2 ను భారతదేశంలో అధికారికంగా ప్రారంభించింది.

  • పోకో M2 బడ్జెట్ విభాగం కోసం రూపొందించబడింది మరియు FHD + స్క్రీన్, అధిక-సామర్థ్యం గల బ్యాటరీ, నీటి-నిరోధక నిర్మాణం మరియు మరిన్ని ఇటువంటి ముఖ్యమైన ఫీచర్స్ ‌తో వస్తుంది.

  • పోకో ఎం 2 యొక్క 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ ‌తో వచ్చిన బేస్ వేరియంట్ ధరను కేవలం రూ .10,999 రూపాయలుగా ప్రకటించింది

Poco M2 కేవలం బడ్జెట్ ధరలో 6GB ర్యామ్, మరిన్ని ఫీచర్లతో వచ్చింది
Poco M2 కేవలం బడ్జెట్ ధరలో 6GB ర్యామ్, మరిన్ని ఫీచర్లతో వచ్చింది

షియోమి సబ్ బ్రాండ్ పోకో తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోనుగా Poco M2 ను భారతదేశంలో అధికారికంగా ప్రారంభించింది. Poco X3 NFC గ్లోబల్ లాంచ్ అయిన ఒక రోజు తర్వాత, జూలై 7 న భారతదేశంలో ప్రారంభించిన ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ కోసం కంపెనీ పోకో ఎం 2 ప్రో యొక్క టోన్-డౌన్ వెర్షన్ ‌ను విడుదల చేసింది.

పోకో M2 బడ్జెట్ విభాగం కోసం రూపొందించబడింది మరియు FHD + స్క్రీన్, అధిక-సామర్థ్యం గల బ్యాటరీ, నీటి-నిరోధక నిర్మాణం మరియు మరిన్ని ఇటువంటి  ముఖ్యమైన ఫీచర్స్ ‌తో వస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారతదేశంలో ఆగస్టులో ప్రారంభించిన రెడ్‌మి 9 ప్రైమ్ నుండి Poco M2 చాలా ఫీచర్లను పోలివుంటుంది. పోకో M2 యొక్క ధర, ఫీచర్లు మరియు లభ్యతను పరిశీలిద్దాం.

Poco M2 Price

పోకో ఎం 2 యొక్క 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ ‌తో వచ్చిన బేస్ వేరియంట్ ధరను కేవలం రూ .10,999 రూపాయలుగా ప్రకటించింది మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ‌కు రూ .12,499 ధరను ఫిక్స్ చేసింది. ఈ M2 స్మార్ట్ ఫోన్ బ్రిక్ రెడ్, పిచ్ బ్లాక్ మరియు స్లేట్ బ్లూ అనే మూడు రంగులలో లభిస్తుంది.

Poco M2 First Sale

Poco M2 మొదటిసారి సెప్టెంబర్ 15 న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌ కార్ట్ ‌లో అమ్మకానికి ఉండనుంది.

Poco M2 ఫీచర్లు

పోకో M2 లో పెద్ద 6.53-అంగుళాల FHD + (2340 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే, సెల్ఫీ కెమెరా కోసం వాటర్ ‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో ఉంటుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 3 గ్లాస్ రక్షణతో వస్తుంది మరియు వేలిముద్ర సెన్సార్ కెమెరా మాడ్యూల్ క్రింద ఉంది. పోకో M2 లో P2i స్ప్లాష్ మరియు రస్ట్ ప్రొటెక్షన్ కూడా అందించారు.

ఈ M2 స్మార్ట్ ఫోన్, MediaTek Helio G80 ప్రాసెసర్ ఆక్టా-కోర్ సిపియు మరియు మాలి-జి 52 GPU తో కలిగి ఉంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్  ఎంపికలతో జతచేయబడుతుంది. ఈ ఫోన్ స్టోరేజ్ విస్తరణ కోసం ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్‌ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 10 లో నడుస్తుంది మరియు త్వరలో MIUI 12 కు అప్ ‌డేట్ చేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

పోకో M2 వెనుక భాగంలో నాలుగు కెమెరాల సెట్ అంటే క్వాడ్ కెమేరా ఇవ్వబడింది. ఇందులో, 13MP ప్రాధమిక కెమెరా, 118-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5MP మాక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇక ముందు వైపు, 8MP సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్ లోపల ఉంది.

M2 లో 5,000WAh బ్యాటరీ అమర్చబడి వుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: The Poco M2 launched with 6GB of RAM, more features at a just budget price
Tags:
poco poco India Poco M2 Poco M2 launch Poco M2 india launch Poco M2 price Poco M2 india pricing Poco M2 specifications Poco M2 availability Poco M2 sale date Poco M2 Flipkart పోకో ఎం2
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
hot deals amazon
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
₹ 11999 | $hotDeals->merchant_name
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
₹ 6799 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
₹ 10999 | $hotDeals->merchant_name
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
₹ 29999 | $hotDeals->merchant_name
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
₹ 22999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status