POCO F6 5G: పోటీ లేని డిస్కౌంట్ ధరకు లభిస్తున్న పోకో పవర్ ఫుల్ 5జి ఫోన్.!

HIGHLIGHTS

POCO F6 5G ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తోంది

ఈ పోకో ప్రీమియం ఫోన్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తోంది

ఈ ఫోన్ యొక్క అన్ని వేరియంట్స్ పై డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది

POCO F6 5G స్మార్ట్ ఫోన్ ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తోంది. 30 వేల బడ్జెట్ ధరలో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రోసెసర్, 1.5K AMOLED స్క్రీన్ మరియు Sony పవర్ ఫుల్ కెమెరా సెటప్ తో వచ్చిన ఈ ఫోన్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పైన అందించిన డిస్కౌంట్ ఆఫర్ మరియు ఈ ఫోన్ యొక్క కంప్లీట్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

POCO F6 5G: ఆఫర్ ఏమిటి?

పోకో ఎఫ్6 5జి స్మార్ట్ ఫోన్ పోకో F సిరీస్ నుంచి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ రూ. 29,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ రోజు ఫ్లిప్ కార్ట్ పండుగ సేల్ నుంచి రూ. 6,000 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 23,999 ధరకు సేల్ అవుతుంది.

ఈ ఫోన్ యొక్క అన్ని వేరియంట్స్ పై డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది, ఈ ఫోన్ యొక్క 12GB + 256 వేరియంట్ రూ. 25,999 ధరతో మరియు 12GB + 512GB హై ఎండ్ వేరియంట్ రూ. 28,999 రూపాయల ధరతో సేల్ అవుతోంది. ఈ ఫోన్ ను ఏదైనా బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

అంటే,బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 22,999 రూపాయల స్టార్టింగ్ ధరకే పొందవచ్చు. వాస్తవానికి, ఈ ఆఫర్ ధరతో పోలిస్తే ఈ బడ్జెట్ లో ఈ ఫోన్ చాలా పవర్ ఫుల్ ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. Check Offer Here

Also Read: మీ ఇంటి గాలిని వడపోసే బెస్ట్ Air Purifier డీల్స్ ఇక్కడ చూడండి.!

POCO F6 5G: ఫీచర్స్

పోకో ఎఫ్6 5జి స్మార్ట్ ఫోన్ 6. 67 ఇంచ్ AMOLED స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ ఫోన్ ఈ బడ్జెట్ ప్రైస్ లో Snapdragon 8s Gen 3 చిప్ సెట్ కలిగిన ఏకైక ఫోన్ గా నిలుస్తుంది. అంతేకాదు, ఇది 8GB LPDDR5X ర్యామ్ మరియు 256GB (UFS 4.0) ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సిస్టం కూడా వుంది. పోకో ఎఫ్ 6 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP (OIS) Sony LYT 600 + 8MP Sony అల్ట్రా వైడ్ కెమెరాలతో డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 20MP సెల్ఫీ కెమెరా కలిగి వుంది . ఈ ఫోన్ తో 60 fps వద్ద 4K వీడియోలు మరియు 30 fps వద్ద 4K HDR 10+ వీడియోలు షూట్ చేయవచ్చు.

ఈ ఆఫర్ గురించి చెప్పాలంటే, ఈ బడ్జెట్ ధరలో తిరుగులేని 5జి ఫోన్ ఆఫర్ గా నిలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :