POCO C51: ఈరోజే విడుదలైన ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

HIGHLIGHTS

పోకో ఈరోజు ఇండియాలో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

POCO C51 లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 OS (గో ఎడిషన్)తో వచ్చింది

POCO C51 స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి

POCO C51: ఈరోజే విడుదలైన ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

పోకో ఈరోజు ఇండియాలో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అదే, POCO C51 స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 OS (గో ఎడిషన్) మరియు ప్రీమియం లుక్ తో బడ్జెట్ ధరలో విడుదల చేసింది. సరికొత్తగా ఈరోజే ఇండియన్ మార్కెట్ లో విడుదల POCO C51 స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

POCO C51: ధర మరియు ఆఫర్లు

పోకో సి 51 స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో రూ.8,499 రూపాయల ధరలో విడుదల చెయ్యబడింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన లాంచ్ అఫర్ లను కూడా కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ముందుగా డబ్బు చెల్లించి కొనేవారికి 700 రూపాయల తగ్గింపు లభిస్తుంది. అయితే, ఇది లిమిటెడ్ పీరియడ్ అఫర్ మాత్రమే అని గుర్తుంచుకోండి.       

POCO C51: స్పెక్స్

పోకో  సి31 స్మార్ట్ ఫోన్ 6.52 ఇంచ్ HD (1600×720) రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G36 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 4GB ర్యామ్ తో పనిచేస్తుంది. అంతేకాదు, Turbo RAM ఫీచర్ తో ఇది 7GB వరకు ర్యామ్ ని అఫర్ చేస్తుంది. ఇది 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది మరియు మెమొరీ కార్డ్ ద్వారా ఈ ఫోన్ స్టోరేజ్ ను 1TB వరకూ విస్తరించవచ్చు. ఈ ఫోన్ పవర్ బ్లాక్ మరియు రాయల్ బ్లూ అనే రెండు కలర్ లలో లభిస్తుంది.         

ఇక కెమెరాల విషయానికి వస్తే, పోకో సి31 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ కెమెరా సెటప్ లో 8MP ప్రధాన కెమెరాని కలిగివుంది. అలాగే, సెల్ఫీల కోసం 5MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ లో బ్యాక్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది. పోకో సి31 ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) ఆధారితంగా Realme UI సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile