Poco ఈరోజు తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Poco C50 ని ఇండియన్ మార్కెట్ లో పరిచయం చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 10 వేల సబ్ కేటగిరిలో పోకో అందించింది. ఈ ఫోన్ పెద్ద డిస్ప్లే, పెద్ద బ్యాటరీ మరియు లెథర్ వంటి లుక్ కలిగిన మంచి డిజైన్ తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర స్పెక్స్ మరియు ఫీచర్లను చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Poco C50: ధర
పోకో సి50 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.6,499 రూపాయల ప్రారంభ ధరలో విడుదల చేసింది. ఇది 2GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజ్ వేరియంట్ కోసం సెట్ చేసింది. ఇందులో 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,299 రూపాయలుగా ప్రకటించింది. ఈ ఫోన్ కంట్రీ గ్రీన్ మరియు రాయల్ బ్లూ అనే రెండు కలర్ అప్షన్లలో లభిస్తుంది.
జనవరి 10వ తేదీ నుండి ఈ సార్ట్ ఫోన్ Flipkart నుండి సేల్ కి అంధుబాటులోకి వస్తుంది.
Poco C50: స్పెక్స్
ఈ పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ C50 పెద్ద 6.5 ఇంచ్ స్క్రీన్ ని HD+ రిజల్యూషన్ తో కలిగి వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio A22 క్వాడ్ కోర్ ప్రాసెసర్ కి జతగా 2GB/3GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. మెమోరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 512GB వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ వెనుక లెథర్ వంటి టెక్స్చర్ డిజైన్ తో ఆకర్షణీయంగా వుంది.
కెమెరాల విషయానికి వస్తే, పోకో C50 స్మార్ట్ ఫోన్ వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ ఓ వచ్చింది. ఇందులో, 8MP మెయిన్ కెమేరాతో మరొక కెమెరాతో వస్తుంది. అలాగే, ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 (Go Edition) ఆపరేటింగ్ సిస్టం పైన పనిచేస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile