Poco C3: రిలీజ్ కంటే ముందే ధర మరియు స్పెసిఫికేషన్లు లీక్

Poco C3: రిలీజ్ కంటే ముందే ధర మరియు స్పెసిఫికేషన్లు లీక్
HIGHLIGHTS

Poco C3 స్మార్ట్ ఫోన్ ని అక్టోబర్ 6 న రిలీజ్ అవ్వనుంది.

అంతేకాదు, పోకో సి 3 ని గురించి Flipkart బ్యానర్ పైన టీజ్ చేస్తోంది.

అయితే, పోకో సి 3 యొక్క లాంచ్ గురించి రిటైల్ బాక్స్‌తో పాటుగా ధర కూడా లీక్ అయింది.

Poco C3 స్మార్ట్ ఫోన్ ని అక్టోబర్ 6 న రిలీజ్ అవ్వనుంది. దీని లాంచ్ గురించి ఇప్పటికే Flipkart ద్వారా టీజ్ చేస్తోంది. అంతేకాదు, పోకో సి3 ని గురించి Flipkart బ్యానర్ పైన టీజ్ చేస్తోంది మరియు ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీని కూడా అందించింది. ఇప్పటి వరకూ ఈ ఫోన్ గుంచిన ఎటువంటి వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, ఇండియాలో పోకో సి 3 యొక్క లాంచ్ గురించి రిటైల్ బాక్స్‌తో పాటుగా ధర కూడా లీక్ అయింది. 

ప్రముఖ టిప్‌స్టర్ ఈ సమాచారాన్ని టెలిగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ లీక్ ప్రకారం, పోకో సి 3 ను 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ తో రూ .10,990 ధరతో విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. పోకో సి 3 యొక్క కొన్ని ఇతర ఫీచర్లు కూడా ఈ బాక్స్ ద్వారా వెల్లడయ్యాయి. అయితే, ఈ ఫోన్‌ను రెడ్‌మి 9 సి యొక్క రీబ్రాండ్ గా లాంచ్ చేయవచ్చని అనిపిస్తోంది. జూలైలో, పోకో సి 3 బ్లూటూత్ SIG జాబితాలో అనేక రెడ్‌మి 9 సిరీస్ ‌లతో గుర్తించబడింది.

భారతదేశంలో Poco C3 యొక్క అంచనా ధర

టిప్‌స్టర్ LeakerBaba టెలిగ్రామ్‌లో రిటైల్ బాక్స్ చిత్రాన్ని షేర్ చేశారు. లీక్ చెయ్యబడిన ఈ బాక్స్ ముందు మరియు వైపు ప్యానల్లను ఫోటోలో చూడవచ్చు. ర్యామ్, స్టోరేజ్, కలర్ మరియు ధర గురించిన సమాచారం ఒక వైపు అందించబడుతుంది. ఇది మాత్రమే కాకుండా, ఇతర సమాచార పరంగా, SAR వాల్యూ మరియు మోడల్ సంఖ్య కూడా ఉన్నాయి. పోకో సి 3 లీక్ అయిన బాక్స్ ప్రకారం, 4 జిబి + 64 జిబి వేరియంట్ ధర రూ .10,990 గా ఉంటుంది మరియు ఈ ఫోన్ మాట్టే బ్లాక్ కలర్ లో వస్తుంది. M2006C3MI మోడల్ సంఖ్య ఈ బాక్స్ పైన ఇవ్వబడింది.

రెడ్‌మి 9 సిరీస్ ఫోన్‌లలో పోకో సి 3 భాగమైన బ్లూటూత్ SIG జాబితాలో కూడా ఇదే మోడల్ నంబర్ తో కనిపించింది. రెడ్‌మి 9 సికి M2006C3MG మోడల్ నంబర్ ఇవ్వబడింది మరియు ఇలాంటి సంఖ్యలను చూస్తే, ఇది భారత మార్కెట్లో రెడ్‌మి 9 సి రీబ్రాండెడ్ వెర్షన్ అవుతుందని తెలుస్తోంది.

ఇక రెడ్‌మి 9 సి విషయానికి వస్తే, అది పెద్ద 6.53-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జి 35 SoC ద్వారా శక్తినిస్తుంది మరియు 4 జిబి ర్యామ్‌తో జతచేయబడుతుంది. రెడ్‌మి 9 సి ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు కనిపిస్తాయి మరియు ఫోన్‌లో సెల్ఫీ కెమెరా ఉంది. ఇది కాకుండా, రెడ్‌మి 9 సి పెద్ద 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వుంటుంది, ఇది 10W ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ కోసం 3.5 ఎంఎం ఆడియో జాక్, 4 జి LTE , వై-ఫై మరియు మైక్రో-యుఎస్‌బి పోర్ట్ అందించబడ్డాయి. రెడ్‌మి 9 సిలో వెనుక వేలిముద్ర సెన్సార్ మరియు AI ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo