Poco M8x 5G: పోకో నుంచి మరో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్ వస్తోంది.!

HIGHLIGHTS

రీసెంట్ గా బిగ్ బ్యాటరీ తో పోకో ఎం8 పవర్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన పోకో

ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి Poco M8x 5G ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ ను కూడా శక్తివంతమైన ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్ చేసింది

Poco M8x 5G: పోకో నుంచి మరో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్ వస్తోంది.!

Poco M8x 5G: రీసెంట్ గా బిగ్ బ్యాటరీ తో పోకో ఎం8 పవర్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన పోకో, ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇప్పటికే పోకో బడ్జెట్ సిరీస్ అయిన ఈ సిరీస్ నుంచి అనేక ఫోన్లు అందించిన పోకో ఇప్పుడు ఈ కొత్త ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ ఫోన్ ను కూడా శక్తివంతమైన ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Poco M8x 5G: లాంచ్ డేట్

పోకో ఎం8x స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఇంకా కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ అప్ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ ను ‘పవర్ కా నయా స్వాగ్’ అనే ట్యాగ్ లైన్ తో టీజింగ్ చేసింది. అంటే, ఇది పవర్ కి కొత్త అర్థం చెప్పే ఫోన్ అని చెబుతోంది. అంటే, ఈ ఫోన్ కూడా పెద్ద బ్యాటరీ మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

Poco M8x 5G: ఫీచర్స్

పోకో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు ఇంకా రివీల్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ని మాత్రం రిలీజ్ చేసింది. ఈ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ మంచి స్లీక్ డిజైన్ మరియు సరికొత్త కలర్ ఆప్షన్ లో లాంచ్ కాబోతున్నట్లు అర్థమవుతుంది. అయితే, ఈ ఫోన్ కీలక ఫీచర్స్ అఫీషియల్ గా రిలీజ్ కావడానికి ఇంకా సమయం ఉంది. కానీ ఈ అప్ కమింగ్ కీలక ఫీచర్స్ గురించి ఆన్లైన్ లో లీక్స్ నడుస్తున్నాయి.

Also Read: Flipkart Sale చివరి రోజు టాప్ రేటెడ్ 55 ఇంచ్ QLED 4K Smart Tv నార్మల్ స్మార్ట్ టీవీ రేటుకే లభిస్తోంది.!

పోకో ఎం8x 5జి: అంచనా ఫీచర్స్

పోకో ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న బడ్జెట్ చిప్ సెట్ లు అయిన Dimensity 6300 లేదా Snapdragon 4 Gen చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే, ఈ ఫోన్ ను ఎంటర్టైన్మెంట్ కోసం తగిన 6.9 ఇంచ్ బిగ్ డిస్ప్లే తో లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

Poco M8x 5G

ఈ ఫోన్ ను 6,000 mAh నుంచి 7,500 mAh శక్తి కలిగిన భారీ బ్యాటరీతో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని కూడా లీక్స్ చెబుతున్నాయి. ఇందులో 50MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఫోన్ అఫీషియల్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ లీక్ అండ్ అంచనా ఫీచర్స్ లో ఎన్ని నిజం అవుతాయో తెలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile