Flipkart లో 128 స్టోరేజ్ తో లాంచ్ అయిన Panasonic eluga i5

Flipkart  లో  128 స్టోరేజ్ తో లాంచ్ అయిన Panasonic eluga i5

పానాసోనిక్ భారతీయ మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఎలుగా  ఎ4 ను ఈ వారంలో విడుదల చేసింది. ఇది భారతీయ మార్కెట్లో 12,490 రూపాయలకు లభ్యం . ఈ ఫోన్ ప్రారంభించిన కొన్ని రోజుల తరువాత, కంపెనీ  యొక్క సరికొత్త స్మార్ట్ఫోన్ పానసోనిక్ ఎలుగ i5 ఇప్పుడు లాంచ్ అయ్యింది . 

ఈ పానసోనిక్ స్మార్ట్ఫోన్ ఇ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లో చూడబడింది.  ఈ ఫోన్ యొక్క అన్ని స్పెక్స్ లిస్ట్ లో ఇవ్వబడ్డాయి .పానాసోనిక్ ఎలుగ I5 స్మార్ట్ఫోన్ స్లిక్ డెస్కాన్ మెటల్ బాడీతో వస్తుంది. ఈ ఫోన్లో 7.5 mm తిక్నెస్  ఉంది. ఈ స్మార్ట్ఫోన్ 5 అంగుళాల HD డిస్ప్లేతో వస్తుంది, ఇందులో 1280 * 720 పిక్సల్స్ రిజల్యూషన్  కలదు . దానిలో 2.5D కర్వ్డ్  గ్లాస్ కూడా ఉంది.పానాసోనిక్ స్మార్ట్ఫోన్ క్వాడ్-కోర్ 1.25GHz మీడియా టెక్ MTK6737 ప్రాసెసర్ ని  కలిగి ఉంది. ఈ ఫోన్లో 2 GB RAM ఉంటుంది మరియు ఇది 16 GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో స్టోరేజ్ ని 128 GB మెమరీ వరకు విస్తరించవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ Android 7.0 నౌగాట్  ఆపరేటింగ్ సిస్టమ్లో పనిచేస్తుంది. 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంటుంది, ఇది F / 2.2 ఎపర్చరు తో వస్తుంది. ఒక LED ఫ్లాష్ మరియు ఒక 5P లెన్స్ ఉంది. ఫోన్ యొక్క సెల్ఫీ  కెమెరా 5 మెగాపిక్సెల్స్. 4G VoLTE , బ్లూటూత్ , GPS అండ్ వైఫై . డ్యూయల్ సిమ్ .  2500mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ  . ఈ ఫోన్ అతి త్వరలో లాంచ్ అవ్వనుందని కంపెనీ తెలిపింది .ఫ్లిప్కార్ట్ లిస్టింగ్ ప్రకారం, ఈ కొత్త పానాసోనిక్ స్మార్ట్ఫోన్ ఎలుగా i5 6,499 ధరతో వస్తుంది. 

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo