Oppo Reno 8 5G: 3 వేల భారీ డిస్కౌంట్ అఫర్ తో సేల్..!!
Oppo Reno 8 స్మార్ట్ ఫోన్ Flipkart సేల్ నుండి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది
ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ 3,000 వేల రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది
ఈ ఫోన్ మీడియాటెక్ పవర్ ఫుల్ ప్రాసెసర్ Dimensity 1300 తో పనిచేస్తుంది
Oppo Reno 8 స్మార్ట్ ఫోన్ Flipkart సేల్ నుండి 3వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో తీసుకొచ్చిన కూడా మంచి ఫీచర్లను అందించింది. 23 నుండి మొదలైన ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ 3,000 వేల రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు ఆఫర్ల వివరాలను చూద్దామా.
SurveyOppo Reno 8: ధర మరియు లాంచ్ ఆఫర్లు
ఇక ఒప్పో రెనో 8 యొక్క ధర వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ.29,999 ధరతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ పైన లాంచ్ ఆఫర్లను కూడా ఒప్పో జత చేసింది. ఒప్పో రెనో 8 ను SBI, ICICI మరియు HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి ఫ్లాట్ 3,000 రూపాయల డిస్కౌంట్ అఫర్ ను కూడా అందించింది. అలాగే, Bank Of Baroda క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 3,000 తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ జూలై 24 నుండి సేల్ కి అంధుబౌట్లోకి వచ్చింది.
Oppo Reno 8: స్పెక్స్
Oppo Reno 8 ను మంచి స్లీక్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ 6.43 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో ఆకలిగి వుంది. ఈ స్క్రీన్ మరింత పటిష్టంగా ఉంచేందుకు గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కూడా అందించింది. ఈ ఫోన్ మీడియాటెక్ పవర్ ఫుల్ ప్రాసెసర్ Dimensity 1300 తో పనిచేస్తుంది. ఈ పవర్ ఫుల్ ప్రాసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఒప్పో రెనో 8 స్మార్ట్ ఫోన్ షిమ్మర్ గోల్డ్ మరియు షిమ్మర్ బ్లాక్ అనే రెండు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.
ఇక కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ను అందించింది. ఇందులో, 50MP SonyIMX766 ప్రధాన కెమెరాకి జతగా 8MP వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాతో 30fps వద్ద 4K వీడియోలను చిత్రీకరించ్చని ఒప్పో తెలిపింది. అలాగే, సెల్ఫీల కోసం 32MP SonyIMX709 సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ అత్యంత వేగవంతంగా ఛార్జ్ చేసే సత్తా కలిగిన 80W SuperVOOC సపోర్ట్ కలిగిన 4,500mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
