Oppo Reno 14 Series: ఇండియాలో కొత్త సిరీస్ ఫోన్స్ లాంచ్ కోసం సిద్ధమైన ఒప్పో.!

Updated on 19-Jun-2025
HIGHLIGHTS

ఇండియాలో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కోసం ఒప్పో సిద్దమయ్యింది

Oppo Reno 14 Series నుంచి ఈ కొత్త ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ కోసం ఒప్పో ఇప్పుడు టీజింగ్ మొదలు పెట్టింది

Oppo Reno 14 Series: ఇండియాలో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కోసం ఒప్పో సిద్దమయ్యింది. ఒప్పో రెనో 14 సిరీస్ నుంచి ఈ కొత్త ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ కోసం ఒప్పో ఇప్పుడు టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ వివరాలు తెలిపే టీజర్ ఇమేజ్ తో ఒప్పో టీజింగ్ చేస్తోంది.

Oppo Reno 14 Series: లాంచ్

ఒప్పో రెనో 14 సిరీస్ లాంచ్ డేట్ ను ఒప్పో కన్ఫర్మ్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ ను త్వరలోనే లాంచ్ చేస్తుందని మాత్రం టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ని ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా అనౌన్స్ చేసింది. అందుకే, ఈ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకమైన టీజింగ్ పేజీ అందించి ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం అందించిన టీజర్ పేజి నుంచి ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ను కూడా ఒప్పో విడుదల చేసింది.

Also Read: అప్ కమింగ్ Sony Dolby Atmos పవర్ ఫుల్ సౌండ్ బార్ లాంచ్ అనౌన్స్ చేసింది.!

Oppo Reno 14 Series: ఫీచర్స్

ఒప్పో రెనో 14 సిరీస్ నుంచి ఎన్ని స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తుందో ఒప్పో ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ సిరీస్ నుంచి లాంచ్ చేయనున్న స్మార్ట్ ఫోన్ ఇమేజ్ ని మాత్రం విడుదల చేసింది. ఇందులో ఒప్పో అప్ కమింగ్ రెనో 14 సిరీస్ స్మార్ట్ ఫోన్ గ్రీన్ కలర్ లో దర్శనమిచ్చింది. ఈ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ సిరీస్ నుంచి వచ్చే ఫోన్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయని కన్ఫర్మ్ అయ్యింది.

కేవలం కెమెరా వివరాలు మాత్రమే కాదు ఈ ఫోన్ డిజైన్ ను కూడా ఈ టీజర్ ఇమేజ్ వెల్లడిస్తుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రౌండ్ కార్నర్ డిజైన్ మరియు వెనుక పెద్ద కెమెరా బంప్ కలిగి ఉంటుంది. అయితే, వాస్తవానికి ఒప్పో రెనో 14 సిరీస్ ను చైనా మార్కెట్లో సరికొత్తగా విడుదల చేసింది. అయితే, ఇండియాలో ఈ ఫోన్ ను సరిగ్గా అదే డిజైన్ మరియు డిటైల్స్ తో అందిస్తుందో లేక ఇంకేమైనా మార్పులు చేస్తుందో చూడాలి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలు ఇంకా కంపెనీ బయట పెట్టలేదు కాబట్టి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు కొంచెం ఎదురు చూడాల్సి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :