Oppo A6 Pro 5G: సైలెంట్ గా 7000 mAh బిగ్ బ్యాటరీ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో.!

Updated on 06-Jan-2026
HIGHLIGHTS

ఇండియన్ మార్కెట్లో కొత్త Oppo A6 Pro 5G ఫోన్ ను లాంచ్ చేసింది ఒప్పో

ఈ స్మార్ట్ ఫోన్ ను దిగువ మిడ్ రేంజ్ ప్రైస్ లో విడుదల చేసింది

ఈ ఫోన్ పై అందించిన భారీ ఆఫర్స్ ద్వారా ఈ ఫోన్ తక్కువ ధరలో అందుకునే అవకాశం కూడా అందించింది

Oppo A6 Pro 5G: ఇండియన్ మార్కెట్లో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది ఒప్పో. ఈ స్మార్ట్ ఫోన్ ను దిగువ మిడ్ రేంజ్ ప్రైస్ లో విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ పై అందించిన భారీ ఆఫర్స్ ద్వారా ఈ ఫోన్ తక్కువ ధరలో అందుకునే అవకాశం కూడా అందించింది. ఈ ఒప్పో రెనో 16 సిరీస్ కంటే రెండు రోజుల ముందు సైలెంట్ గా విడుదల చేసిన ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ మరియు ప్రైస్ వివరాలు తెలుసుకోండి.

Oppo A6 Pro 5G : ప్రైస్ అండ్ ఆఫర్స్

ఒప్పో ఏ6 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ (8GB + 128GB ) వేరియంట్ రూ. 21,999 ధరతో మరియు ఈ ఫోన్ (8GB + 256GB ) హైఎండ్ వేరియంట్ ను రూ. 23,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను బ్రౌన్ మరియు గోల్డ్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా, ఒప్పో అఫీషియల్ సైట్ మరియు అన్ని రిటైల్ షాప్ లో లభిస్తుంది. ఈ ఫోన్ నిన్నటి నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది.

ఆఫర్స్

ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా జత చేసి అందించింది. ఈ ఫోన్ పై SBI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 2,500 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 19,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Oppo A6 Pro 5G : ఫీచర్స్

ఈ స్మార్ట్ ఫోన్ లో 6.75 ఇంచ్ IPS LCD స్క్రీన్ ఉంటుంది. అయితే ఇది కేవలం (1570 × 720) HD+ పిక్సెల్ రిజల్యూషన్ మాత్రమే కలిగి ఉంటుంది. అయితే, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గరిష్టంగా 1,125 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ Dimensity 6300 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంది. ఇది ARM Mali-G57 MC2 GPU తో మంచి గ్రాఫికల్ పనితనం అందిస్తుంది.ఈ ఫోన్ 8GB LPDDR4x ర్యామ్ తో మరియు 128GB / 256GB స్టోరేజ్ ఆప్షన్లు కూడా కలిగి ఉంటుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక 50MP ప్రధాన సెన్సార్ జతగా 2MP మోనోక్రోమ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ అనేకమైన ఒప్పో కెమెరా ఫిల్టర్లు మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ 1080 వీడియో సపోర్ట్ మాత్రమే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 4K కెమెరా సపోర్ట్ లేదని తెలిపింది.

Also Read: Google Pixel 9A పై ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ బిగ్ డీల్ అందుకోండి.!

ఒప్పో ఈ ఫోన్‌లో 7000mAh పెద్ద బ్యాటరీ అందించింది మరియు ఇది ఒకరోజు కంటే ఎక్కువ బ్యాకప్ అందిస్తుందని ఒప్పో తెలిపింది. అంతేకాదు, 80W SUPERVOOC వేగవంతమైన వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అదనంగా, ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :