Oppo Find X2, Find X2 Pro ఇండియాలో 4PM కి లాంచ్ కానున్నాయి : లైవ్ చూడడం, అంచనా ధర, స్పెక్స్ మరియు మరిన్ని..

Oppo Find X2, Find X2 Pro ఇండియాలో 4PM కి లాంచ్ కానున్నాయి : లైవ్ చూడడం, అంచనా ధర, స్పెక్స్ మరియు మరిన్ని..
HIGHLIGHTS

Find X2 మరియు Find X2 Pro కూడా 5G కనెక్టివితో మరియు క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 865 చిప్ సెట్ శక్తితో పనిచేస్తాయి.

Oppo Find X2 సిరీస్ ఈ రోజు భారతదేశంలో సాయంత్రం 4 గంటలకు లాంచ్ కానుంది. ఈ సిరీస్ లో, Find X2  మరియు Find X2 Pro ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ ‌ఫోన్‌లు కూడా 5G కనెక్టివితో మరియు క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 865 చిప్ సెట్ శక్తితో పనిచేస్తాయి. ఇవి ఒప్పో నుండి అగ్రస్థాయి స్మార్ట్ ఫోన్లుగా, గత  మార్చిలో యూరోపియన్ మార్కెట్లలో ప్రకటించబడ్డాయి.

Oppo Find X2, Find X2 Pro లాంచ్ లైవ్ స్ట్రీమ్ లింక్

Find X2 మరియు Find X2 Pro లాంచ్ ఈవెంట్ ఆన్‌లైన్‌లో మాత్రమే జరుగుతుంది, COVID వ్యాప్తి తరువాత  ఇది ప్రపంచానికి సాధారణం విషయంగా మారింది. ఈ కార్యక్రమం ఈ రోజు 4PM కి ప్రారంభం కానుంది మరియు ఇది Oppo Mobile India channel ద్వారా మరియు దాని షోషల్ హ్యాండిల్స్ ద్వారా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం (live-streame) చేయబడుతుంది.

Oppo Find X2 Pro స్పెక్స్ మరియు ఫీచర్లు

ఫైండ్ ఎక్స్ 2 ప్రో లో HDR 10 + సర్టిఫికేషన్‌ గల ఒక 6.7-అంగుళాల QHD + 120 Hz అమోలేడ్ డిస్‌ప్లే ఉంది మరియు స్నాప్‌డ్రాగన్ 865 చిప్సెట్ కి జతగా 12 జిబి LPDDR 5 ర్యామ్ మరియు 512 GB  UFS 3.0 స్టోరేజ్‌తో నడుస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారంగా Color 7.1 పై నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్, 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు కలిగిన ఒక 4,260 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఒక 48 MP ప్రైమరీ కెమెరా, మరో 48MP  అల్ట్రావైడ్ లెన్స్ మరియు 13MP  పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో 5 X ఆప్టికల్ జూమ్ మరియు 60 X  హైబ్రిడ్ జూమ్‌ను అందిస్తుంది. సెల్ఫీల కోసం డిస్ప్లేలో ఒక 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

Oppo Find X2 స్పెక్స్ మరియు ఫీచర్లు

ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో వేరియంట్‌తో సమానంగా చాలా ఫీచర్లను అందుకుంటుంది. ఈ Oppo Find X2 ఇది అదే 6.7-అంగుళాల QHD + 120 Hz అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు స్నాప్‌డ్రాగన్ 865 చిప్సెట్ కి జతగా 12 జిబి LPDDR 5 ర్యామ్ తో వస్తుంది.  అయితే, ఇంటర్నల్ స్టోరేజి మాత్రం 256 GB  UFS 3.0 స్టోరేజ్‌తో మాత్రమే వస్తుంది. ఈ ఫైండ్ ఎక్స్ 2 కూడా 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,200 ఎంఏహెచ్ బ్యాటరీపై నడుస్తుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే, ఇది కొద్దిగా భిన్నంగా ఉంటుంది. 48MP ప్రాధమిక కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ మరియు 3x హైబ్రిడ్ జూమ్‌తో 13MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇక ముందు మాత్రం అదే 32MP  ఫ్రంట్ కెమెరాను అలాగే ఉంచారు.

Oppo Find X2, Find X2 Pro ఇండియాలో అంచనా ధరలు 

ఈ రెండు ఫోన్లు ఇప్పటికే అమెజాన్ ఇండియాలో జాబితా చేయబడ్డాయి మరియు ఒక నివేదిక ప్రకారం, ఫైండ్ ఎక్స్ 2 12 జిబి + 256 జిబి వేరియంట్ కోసం రూ .60,000 నుండి రూ .65,000 మధ్య ఉంటుందని కూడా తెలుస్తోంది. ఐరోపాలో, ఒప్పో ఫైండ్ X2 ధర 12GB + 256GB వేరియంట్‌కు EUR 999 (సుమారు రూ. 83,400) కాగా, 12GB + 512GB తో ఫైండ్ X2 ప్రో ధర EUR 1,199 (సుమారు రూ. 1,00,000). ఇప్పటివరకు విడుదల చేసిన మొబైల్ మార్కెట్ పోకడని బట్టి చూస్తే, భారతీయ ధర సాధారణంగా ఇతర పాశ్చాత్య మార్కెట్ల కంటే తక్కువగా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo