ఇండియాలో తన Oppo A9 స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసిన OPPO సంస్థ : ధర, ప్రత్యేకతలు మరిన్ని వివరాలు
OPPO సంస్థ, మిడ్-రేంజ్ ధర విభాగంలో A9 స్మార్ట్ ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది.
OPPO సంస్థ, మిడ్-రేంజ్ ధర విభాగంలో A9 స్మార్ట్ ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ముందుగా, ఇది ఏప్రిల్‌లో చైనాలో ప్రారంభించబడింది. ఈ ఒప్పో A9 యొక్క ముఖ్యాంశాలు చూస్తే గనుక, ఇది పొడవైన ఆస్పెక్ట్ రేషియో, తక్కువ కాంతి(Low-Light) ఫోటోగ్రఫీ కోసం అల్ట్రా నైట్ మోడ్, 4000mAh + బ్యాటరీ మరియు ఫోన్ యొక్క గేమింగ్ పనితీరును పెంచే హైపర్‌బూస్ట్ వంటి సాఫ్ట్వేర్ పనితాన్ని కలిగి ఉంటుంది. ఇది జూలై 20 నుండి అమెజాన్.ఇన్ మరియు రిటైల్ దుకాణాల్లో అమ్మకాలను సాగించనుంది.
Oppo A9 ప్రత్యేకతలు
ఒప్పో A9 స్మార్ట్ ఫోనులో ఒక 6.53-అంగుళాల పూర్తి HD + (1080×2340 పిక్సెల్స్) డిస్ప్లేని ఒక 90.70 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో మరియు వాటర్‌డ్రాప్ నోచ్ డిజైనుతో అందించింది.ఇది ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఇది మీడియా టెక్ హెలియో P 70 చిప్సెట్తో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా Color 6.0OS పైన పనిచేస్తుంది. ఇక సెక్యూరిటీ విషయంలో, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ఒక వేలిముద్ర స్కానరుతో వస్తుంది.
కెమెరా విభాగంలో, ఈ ఒప్పో A9 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇది 16MP ప్రాధమిక సెన్సార్‌ను f / 1.8 లెన్స్ మరియు 2MP సెకండరీ సెన్సార్‌తో జతగా కలిగి ఉంది. ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నోచ్ లో 16 MP సెల్ఫీ కెమెరా ఉంది, అది f / 2.0 అపర్చరు లెన్స్ కలిగి ఉంటుంది. ఈ ఫ్రంట్ కెమెరా 130 నుదుటి పాయింట్లను గుర్తించగలదని మరియు ఫేస్ స్లిమ్మింగ్ ఫీచర్‌తో పనిచేస్తుందని ఒప్పో సంస్థ పేర్కొంది.
కనెక్టివిటీ విషయంగా, ఈ ఒప్పో A9 లో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v4.2, GPS / A-GPS మరియు OTG మద్దతుతో మైక్రో- USB ఉన్నాయి. ఇక సెన్సార్ల విషయానికి వస్తే, దీనికి యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ మరియు గైరోస్కోప్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ ఒక పెద్ద 4020mah బ్యాటరీని స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజితో కలిగివుంటుంది.
ఈ ఒప్పో A 9 భారతదేశంలో రూ .15,490 ధరతో విడుదల చెయ్యబడింది. ఇది ఒకే స్టోరేజ్ ఆప్షన్లో వస్తుంది, అంటే 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ మాత్రమే ఉంటుంది. జూలై 20 నుండి ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల నుండి కొనుగోలు చేయడానికి ఇది అందుబాటులో ఉంటుంది.