అక్టోబర్ 10న లాంచ్ కానున్న OPPO K5 ప్రైస్ లీక్

అక్టోబర్ 10న లాంచ్ కానున్న OPPO K5 ప్రైస్ లీక్
HIGHLIGHTS

ఈ హ్యాండ్‌సెట్‌లో ఒక 6.4-అంగుళాల FHD + AMOLED డిస్ప్లే లభిస్తుంది.

OPPO తన OPPO K3 స్మార్ట్‌ ఫోన్ యొక్క తదుపరి తరం ఫోనుగా OPPO K5 ని అక్టోబర్ 10 న విడుదల చేయనుంది. అదేసమయంలో, ఫ్లాగ్‌షిప్ OPPO రెనో ఏస్ స్మార్ట్‌ ఫోన్ను కూడా లాంచ్ చేయవచ్చు. అయితే, ఆశ్చర్యకరంగా ఈ లాంచ్ కావడానికి ముందుగానే, ఈ OPPO K5 యొక్క రెండు వేరియంట్ల ధరలు వెల్లడయ్యాయి.

6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ వంటి రెండు వేరియంట్‌లతో ఒప్పోకే 5 ను చైనాలో తీసుకురానున్నట్లు ఈ లీక్ వెల్లడించింది. ఈ రెండు వేరియంట్లలో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా 1,799 యువాన్ (~ $ 251) మరియు 1,999 యువాన్ (~ $ 277) గా ఉండనున్నట్లు తెలిపింది. OPPO K5 యొక్క 8GB RAM మరియు 256GB స్టోరేజ్ వేరియంట్ ధరను మాత్రం ఈ లీక్‌లో వెల్లడించలేదు.

OPPO K5 ప్రత్యేకతలు

ఈ OPPO ఫోన్ ఇటీవలే TENAA లో గుర్తించబడింది, ఇది రాబోయే OPPO K5 ఫోన్ కావచ్చని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఒక 6.4-అంగుళాల FHD + AMOLED డిస్ప్లే లభిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై తో పనిచేస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 730G మొబైల్ ప్లాట్‌ ఫామ్ ద్వారా శక్తినిస్తుందని పుకార్లు కూడా ఉన్నాయి. అలాగే, ఈ చిప్ సెట్ ఒక 8GB RAM తో జత చేయబడుతుంది మరియు  128GB అంతర్గత స్టోరేజితో కూడా ఉంటుంది.

OPPO K5 ఒక 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో క్వాడ్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది, దీనిలో ఒక సెన్సార్ శామ్‌సంగ్ GW1 64 మెగాపిక్సెల్ లెన్స్, మరొకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, మిగతా రెండు సెన్సార్లు 2 మెగాపిక్సెల్ లెన్సులు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30W VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ను తీసుకురానున్నట్లు మునుపటి నివేదికలు వెల్లడించాయి.

OPPO రెనో 2 ఎఫ్ స్మార్ట్‌ఫోన్ కూడా టెనా లిస్టింగ్‌లో కనిపించింది. అక్టోబర్ 10 న జరిగే కార్యక్రమంలో కంపెనీ OPPO రెనో ఏస్ మరియు కె 5 తో పాటు రెనో 2 ఎఫ్ ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo