OPPO K3 ఒక పాప్ – అప్ సెల్ఫీ, బెస్ట్ డ్యూయల్ కెమేరాతో జూలై 19 న లాంచ్ కానుంది : ఇవే విశేషాలు
ఈ OPPO K3 ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ట్రెండీగా నడుస్తున్న అన్ని హంగులను కలిగి ఉంటుంది.
అందరికంటే ముందుగా మంచి కెమేరా ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేయడంలో ముందుడే ఒప్పో సంస్థ, కొంత ఆలస్యంగా అయినా సరే తన అభిమానులను గోపా ప్రత్యేకతలు కలిగిన స్మార్ట్ ఫోనుతో పలకరించనుంది. అదే, ఈ OPPO K3 ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ట్రెండీగా నడుస్తున్న అన్ని హంగులను కలిగి ఉంటుంది. పాప్ అప్ సెల్ఫీ కెమేరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు గొప్ప ప్రాసెసర్ ఒకటేమిటి పూర్తిగా అన్ని ప్రత్యేకతలతో నిండుగా కనిపిస్తోంది. దీనికి సంబంచిన ఒక మైక్రో సైట్ ను అమేజాన్ ఇండియా ప్రత్యేకంగా అందిస్తోంది. అంటే, ఈ నెల 19 న ఇండియాలో విడుదలకానున్న స్మార్ట్ ఫోన్ అమేజాన్ ఇండియా ద్వారా సేల్ సేల్ జరగనుంది అని అర్ధమవుతుంది.
SurveyOPPO K3 ప్రత్యేకతలు
ఈ ఫోను గురించిన కొన్ని వివరాలను అమేజాన్ తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అందించింది. ఈ ఫోన్ కళ్లకు ఏటివాటి హాని చెయ్యని Eye ప్రొటక్షన్ గల ఒక 6.5 అంగుళాల AMOLED డిస్ప్లేతో రానుంది. ఈ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా గరిష్టంగా 8GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. అలాగే, ఇది 128GB వరకు స్టోరేజి ఎంపికతో ఎంచకోవచ్చు. ఇందులో ఒక 3765 mAh బ్యాటరీని అందించారు. అయితే, ఇందులో అందించిన VOOC ఫ్లాష్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ ద్వారా ఇది 25% తక్కువ సమయంలోనే పూర్తిగా ఛార్జ్ చేయగలదు.
ఇక కెమేరాల విభాగానికి వస్తే, చైనాలో విడుదల చేసిన వేరియంట్ ప్రకారంగా చూస్తే, వెనుక ఒక 16MP ప్రధానమైన గొప్ప కెమెరాతో పాటుగా 2MP డెప్త్ గల డ్యూయల్ కెమేరా అందించవచ్చు. అయితే ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించినట్లు స్పష్టం చేసింది. ఇక ఈ ఫోనుతో భారీ గేమ్స్ ఆడుకోవటానికి వీలుగా Game Boost 2.0 ని కూడా అందించింది. అలాగే, చక్కని సౌండ్ కోసం Dolby Atmos ని ఈ ఫోనులో ఇచ్చింది. సెల్ఫీల కోసం గొప్ప పాప్ అప్ సెల్ఫీ కెమెరాని కూడా అందించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
