OPPO K14x 5G launched under 15k price with 6500 mAh big battery
OPPO K14x 5G: ఈరోజు ఒప్పో కొత్త ఫోన్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. అదే ఒప్పో కె 14x స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను 15 వేల రూపాయల ఉప బడ్జెట్ ధరలో 6500 mAh బిగ్ బ్యాటరీ మరియు స్టైలిష్ లుక్ డిజైన్ తో అందించింది. ఒప్పో ఇండియన్ మార్కెట్లో ఈ రోజు ప్రవేశపెట్టిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
ఒప్పో ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ మరియు రెండు రంగుల్లో అందించింది. ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ 4 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ తో కేవలం రూ. 14,999 ధరతో లాంచ్ అయ్యింది. ఒప్పో కె 14x ఫోన్ రెండో వేరియంట్ రూ. 16,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ వేరియంట్ 4 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్ ఐసీ బ్లూ మరియు ప్రిజం వయోలెట్ రెండు రంగుల్లో లభిస్తుంది.
ఈ ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,500 రూపాయల SBI, HDFC మరియు ICICI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈరోజు నుంచి ఈ ఫోన్ ముందస్తు బుకింగ్స్ ను కంపెనీ ప్రారంభించింది. ఈ ఫోన్ ను Flipkart మరియు ఒప్పో అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు.
Also Read: Realme narzo 90x: వాలంటైన్స్ డే కోసం కొత్త మెరూన్ కలర్ లో లాంచ్ అయ్యింది.!
ఒప్పో కె14x స్మార్ట్ ఫోన్ 6.75 ఇంచ్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు ఇది HD గేమింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5జి చిప్ సెట్ తో నడుస్తుంది. ఇందులో 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ లో RAM Expansion ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ మంచి స్లీక్ డిజైన్ లో చూడగానే ఆకట్టుకునే రంగుల్లో ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ కలర్ OS సాఫ్ట్ వేర్ తో Android 16 ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ 50MP మెయిన్ సెన్సార్ జతగా 2MP సెకండరీ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI Eraser 2.0 వంటి ఆకట్టుకునే ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6500 mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ అయ్యింది. ఇది కాకుండా ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ IP64 రేటింగ్ తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది.