Oppo K14 Plus 5G మిడ్ రేంజ్ ధరలో పవర్ ఫుల్ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

Oppo K14 Plus 5G బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది

సరికొత్త డిజైన్ మరియు గేమింగ్ కోసం తగిన గొప్ప మీడియాటెక్ ప్రాసెసర్ తో అందించింది

ఈ ఫోన్ పై రూ. 4,000 రూపాయల తక్షణ భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది

Oppo K14 Plus 5G మిడ్ రేంజ్ ధరలో పవర్ ఫుల్ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ కోసం గత రెండు వారాలుగా టీజింగ్ చేస్తూ వచ్చిన ఒప్పో, ఎట్టకేలకు ఈ స్మార్ట్ ఫోన్ ని ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు గేమింగ్ కోసం తగిన గొప్ప మీడియాటెక్ ప్రాసెసర్ తో అందించింది. ఒప్పో సరి కొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ ఆఫర్స్ మరియు ఫీచర్లు ఏమిటో చూద్దామా.

Oppo K14 Plus 5G : ప్రైస్

ఒప్పో ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో విడుదల చేసింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడొచ్చు.

  • ఒప్పో కె 14 ప్లస్ (6GB + 128GB) రూ. 29, 999
  • ఒప్పో కె 14 ప్లస్ (8GB + 128GB) రూ. 32, 999
  • ఒప్పో కె 14 ప్లస్ (8GB + 256GB) రూ. 35, 999

ఒప్పో ఈ ఫోన్ ప్రత్యేకమైన సేల్ ని ఈరోజు 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.

ఆఫర్స్

ఒప్పో ఈ ఫోన్ గొప్ప లాంచ్ ఆఫర్స్ అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 4,000 రూపాయల తక్షణ భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 25,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Also Read: Vivo S2 FE: ఇటీవల విడుదల చేసిన వివో ఎస్ 1 ఫోన్ బడ్జెట్ వెర్షన్ లాంచ్ చేస్తున్న వివో.!

Oppo K14 Plus 5G : ఫీచర్స్

ఈ ఫోన్ 6.78 ఇంచ్ బిగ్ AMOLED స్క్రీన్ ను 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ తో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ Dimensity 7360 Max ప్రాసెసర్ తో నడుస్తుంది. మీడియాటెక్ యొక్క ఈ కొత్త చిప్ సెట్ 1Mn కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్ జతగా 8GB వర్చువల్ ర్యామ్ మరియు గరిష్టంగా 256GB స్టోరేజ్ ఆప్షన్ తో కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా తో వస్తుంది. ఇందులో 50MP జతగా 2MP బొకే కెమెరా ఉన్నాయి. 16MP Sony IMX 480 సెల్ఫీ ని ఈ ఫోన్ ముందు భాగంలో అందించింది. ఈ లేటెస్ట్ ఒప్పో ఫోన్ 8000 mAh పవర్ ఫుల్ బ్యాటరీ శక్తితో లాంచ్ అయ్యింది మరియు ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W సూపర్ ఊక్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :