Oppo Find X9 Ultra and Find X9s Launch today in India Price Specs features
Oppo Find X9 Ultra మరియు X9s ఇండియా లాంచ్ గురించి ఒప్పో అనౌన్స్మెంట్ చేసింది. 2025 బెస్ట్ కెమెరా ఫోన్ గా అనేక మంది టెక్ రివ్యూవర్స్ నుంచి కితాబు అందుకున్న ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 ప్రో ఫోన్ సిరీస్ లో హై ఎండ్ ఫోన్ ను ఇప్పుడు ఒప్పో పరిచయం చేయడానికి సిద్ధం అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 200MP కెమెరాతో వస్తోంది.
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా మరియు ఎక్స్ 9s స్మార్ట్ ఇండియా లాంచ్ గురించి మాత్రమే ఒప్పో అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. కమింగ్ సూన్ పేరుతో ఈ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ స్టార్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ఇండియా మరియు కంపెనీ అఫీషియల్ X అకౌంట్ నుంచి టీజర్ వివరాలు మాత్రం రివీల్ చేసింది.
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా స్మార్ట్ ఫోన్ DSLR కెమెరా మాదిరిగా కనిపించే డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ కెమెరా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని ఒప్పో ఈ ఫోన్ గురించి తెగ పొగిడేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ కెమెరాతో తీసిన ఫోటోలు మరియు వీడియోలు కూడా తన ఎక్స్ అకౌంట్ నుంచి రిలీజ్ చేస్తోంది.
ఈ ఫోన్ లో పవర్ ఫుల్ కెమెరా సెటప్ ని అందించినట్లు క్లియర్ గా అర్ధం అవుతుంది. ఎందుకంటే, ఈ ఫోన్ లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, డ్యూయల్ 200MP Hasselblad కెమెరాలు జతగా 10x ఆప్టికల్ టెలిఫోటో జూమ్ సపోర్ట్ కలిగిన 50MP Hasselblad కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో గొప్ప జూమ్ కోసం అదనపు సెటప్ అవసరం లేకుండా బిల్ట్ ఇన్ టెలీ కన్వర్టర్ ను అందించినట్లు ఒప్పో తెలిపింది.
ఈ కెమెరా గొప్పతనాన్ని తెలియ చేయడానికి ఈ ఫోన్ తీసిన కొన్ని శాంపిల్ ఫోటోలు కూడా తన ఎక్స్ అకౌంట్ నుంచి షేర్ చేసింది. ఇందులో 200MP కెమెరాతో స్పేస్ నుంచి తీసినట్లు చెబుతున్న ఫోటో కూడా ఉంది. అలాగే, దూరం నుంచి జూమ్ చేసి 50MP 10x ఆప్టికల్ టెలిఫోటో తో తీసిన కొన్ని పక్షుల ఫోటోలు కూడా షేర్ చేసింది.
Also Read: iPhone 17 ఫోన్ ను SASA LELE సేల్ నుంచి అతి చవక అందుకోండి అంటున్న Flipkart
ఇక ఈరోజు కొత్త విడుదల చేసిన టీజర్ వీడియో నుంచి ఈ ఫోన్ కెమెరా మరిన్ని వివరాలు వెల్లడించింది. ఈ ఫోన్ 30FPS వద్ద స్టేబుల్ 8K వీడియో రికార్డింగ్ చేసిన వీడియో ను ఈరోజు విడుదల చేసింది. అంతేకాదు, 10 బిట్ Log రికార్డింగ్ వీడియో మరియు సినిమాటిక్ LUTs సపోర్ట్ కూస్తో ఈ ఫోన్ ఉన్నట్లు రివీల్ చేసింది.
మొత్తంగా, ఈ ఫోన్ భారీ కెమెరా సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు క్లియర్ గా చెబుతోంది. ఈ ఫోన్ మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం.