రెండర్-లీక్: ట్రిపుల్ కెమెరా మరియు నాచ్ డిస్ప్లే OPPO ఫైండ్ X లో….

Updated on 14-May-2018

రెండర్ ద్వారా తెలుస్తున్నదేమిటంటే  OPPO Find X లో OPPO R15 వంటి నాచ్  డిస్ప్లే డిజైన్  వున్నాయి . Find X స్మార్ట్ఫోన్ 19: 9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లే ను కలిగి ఉన్న సూచనలు ఉన్నాయి.ఫైండ్  X వెనుక ఒక వర్టికల్  ట్రిపుల్ కెమెరా మరియు ఒక LED ఫ్లాష్ ఉంది.

ఫింగర్ ప్రింట్  స్కానర్ పరికరానికి రేర్ ప్యానెల్లో కలదు , దీనర్థం కంపెనీ అండర్ డిస్ప్లే  వేలిముద్ర సెన్సార్ అందించగలదు. ఇటీవలే కంపెనీ  ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ల కోసం పేటెంట్ ఆమోదం కూడా పొందింది, ఈ పరికరం అడ్వాన్స్ బయోమెట్రిక్ రికగ్నిషన్ టెక్నాలజీతో వస్తుంది . ఇతర రూమర్స్ ప్రకారం ఈ హ్యాండ్సెట్  సూపర్ ఫాస్ట్ 15 నిమిషాల ఫ్లాష్ ఛార్జ్ మరియు 5x లాస్లెస్ జూమ్ సహా కొన్ని ఇతర ఆధునిక లక్షణాలను అమర్చవచ్చు అని సూచిస్తున్నాయి.

OPPO 2014 లో ఒప్పో ఫైండ్ 7 చివరి ప్రధాన స్మార్ట్ఫోన్  ప్రారంభించింది . రూమర్స్ ప్రకారం, ఈ సంవత్సరం హై ఎండ్ మార్కెట్ ని  లక్ష్యంగా చేయడానికి OPPO ఫైండ్  సిరీస్ ఫోన్లను ప్రారంభించగలదు. గత కొన్ని సంవత్సరాలలో,ఫైండ్  9 మరియు ఫైండ్  11 గురించి రూమర్స్ కూడా కనుగొనబడ్డాయి, కానీ ఈ పరికరాలు ఎప్పుడు ప్రారంభించబడలేదు. అయితే, కొత్త రూమర్  సంస్థ ఈ సంవత్సరం OPPO ఫైండ్  X స్మార్ట్ఫోన్ను ప్రారంభించబోతుందని పేర్కొంది.

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :